ఇటీవల తన భార్య ఐశ్వర్యతో విడాకుల విషయంలో వార్తల్లోకి ఎక్కాడు ధనుష్. వీరిద్దరూ మళ్లీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో పెద్ద మనుషుల జోక్యం ఫలించిందని చెన్నై వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావాల్సివుంది. అయితే ఈలోగా.. తన సినిమాలపై దృష్టి పెట్టాడు ధనుష్. తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ ఇల్లు కడుతున్నాడట ధనుష్. ఈ అంకె నిజమైతే, సౌత్ హీరోల్లో అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మిస్తోంది ధనుషే అనుకోవాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న `సార్`లో ధనుష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి గానూ.. రూ.50 కోట్లపారితోషికం అందుకున్నట్టు టాక్. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా నుంచి కూడా రూ.50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. ఈరెండు చిత్రాలూ ఈ యేడాదే పూర్తవుతాయి. వీటితో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నాడు. అంటే యేడాదికి రూ.150 కోట్ల ఆదాయం అన్నమాట. అలాంటప్పుడు రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకోవడంలో వింతేముంది?