ధనుష్ హీరోగా తెలుగు,తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్ కథానాయిక. ఇందులో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ లో విద్యా వ్యవస్థ నేపథ్యంలో ‘సార్’ వుండబోతుందని చెప్పారు.
‘’ఈ దేశంలో చదువు అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్విస్. త్రిపాఠి ఎడ్యుకేషనల్ సంస్థల తరపున కొన్ని గవర్నమెంట్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలని అనుకుంటున్నాం’’ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైయింది. అలా ఓ కాలేజ్ కి ఫ్యాకల్టీగా వచ్చిన ధనుస్.. ఎదో మంచి చేయాలని ప్రయత్నిస్తాడు. సముద్రఖని పాత్ర రూపంలో ధనుష్ కి ఎలా ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయనేది ‘సార్’ కథాంశమని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
*క్యాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్న వాడు కొంటాడు. తక్కువున్న వాడు అప్పు చేసైనా కడతాడు.
*ఎడ్యుకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు.
*డబ్బు ఎలాగైనా సంపాయించవచ్చు. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాయించి పెడుతుంది’’ లాంటి డైలాగులు సినిమా కంటెంట్ ని ప్రజంట్ చేశాయి.
ట్రైలర్ లో ధనుష్ రెండు దశల్లో కనిపించాడు. ఇందులో ఒక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వుంది. ట్రైలర్ సముద్రఖని, సంయుక్త మీనన్, సాయి కుమార్ కీలకంగా కనిపించారు. జీవి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం బావుంది. వెంకీ అట్లూరి ఇప్పటివరకూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లు తీశారు. అయితే సార్ లో మాత్రం ఒక బలమైన సోషల్ ఇష్యూ ని టచ్ చేశారని సార్ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఈ నెల 17 న సినిమా విడుదలౌతుంది.