న్యాయమూర్తుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న్ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోసారి అదే పని చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి కుమార్తె వివాహం ఇండోర్ లో జరిగింది. వారి పెళ్లికి టీటీడీ అర్చకులని తీసుకుని ధర్మారెడ్డి , వేమిరెడ్డి వెళ్లారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
గతంలో వారు ఓ న్యాయమూర్తి ఇంట్లో పెళ్లికి వెళ్లి రూ. రెండు కోట్ల విలువైన వజ్రాల వాచీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. ఆ న్యాయమూర్తి తిరస్కరించి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు దానిపై విచారణ జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ తర్వాత కూడా వారు చాలా మంది న్యాయమూర్తుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా వారు జస్టిస్ జేకే మహేశ్వరి ఇంట్లో పెళ్లికి జంటగా వెళ్లడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ధర్మారెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో ఆహ్వానం అందితే వెళ్లి ఉంటారు.. . మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏం పని అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ప్రముఖులతో లాబీయింగ్ కోసం టీటీడీని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ వచ్చినప్పటి నుండి టీటీడీలో ధర్మారెడ్డిదే హవా. వేమిరెడ్డి క్యాష్ పార్టీగా పేరు తెచ్చుకున్నారు. మొత్తంగా ఓ పెద్ద హిడెన్ నెట్ వర్క్ ను.. ధర్మారెడ్డి, వేమిరెడ్డి నేతృత్వంలో జగన్ రెడ్డి నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.