అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా విశాఖలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల్ని స్వాహా చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావుకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో లబ్దిదారులు.. వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వారికి మేలు జరిగేలా ఓ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన నేతృత్వంలోనే కమిటీ వేశారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో పరిశీలనలు చేస్తుందట.
అంటే తమ మూడు రాజధానుల వాదనలకు.. దక్షిణాఫ్రికా ఎలా ఉపయోగపడిందో.. అలా తాము తమ అక్రమాలను సక్రమం చేసుకునేందుకు ఎక్కడ ఎలాంటి విధానాలు ఉన్నాయో.. పరిశీలించి.. వాటిని ఇక్కడ సిఫారసు చేస్తారన్నమాట. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత కొన్నాళ్లుగా అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా లాగేసుకుంది. కొంత మంది వైసీపీ నేతలు బలవంతంగా రాయించేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ అరాచకాలు.. అక్రమాలు ఉన్న సమయంలో అసైన్డ్ కమిటీ ధర్మాన నేతృత్వంలో వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
అసైన్డ్ ల్యాండ్స్ అనేవి అనుభవించడానికి మాత్రమే ఇస్తారు. అమ్ముకోవడానికి కాదు. చేతులు మారితే కేటాయింపులు రద్దయినట్లే. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేతులు మారినప్పటికీ.. వారికి క్రమబద్దీకరించే అవకాశాన్ని కల్పించే ఆలోచన చేస్తున్నారు.. ధర్మాన వ్యవహారంలో చాలా వరకూ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీలు చేసిటన్లుగా సిట్ తేల్చింది. ఇప్పుడా వ్యవహారం తేలకుండానే… చివరికి ధర్మానకే. .. తన భూముల్ని కట్టబెట్టుకునే అధికారం కల్పిస్తున్నారు.