మూడు రాజధానుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయవరాగ్లోల చర్చనీయాంశమవుతోంది.ఇలాంటి సవాళ్లు వైసీపీలో ఆషామాషీగా చేయరని ఓ వ్యూహం ప్రకారం తాడేపల్లి ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే చేస్తారని వైఎస్ఆర్లో ఉన్న ఏ స్థాయినాయకుడికైనా తెలుసు. విశాఖలో ఎగ్జిక్యూటివవ్ క్యాపిటల్ అంటే అదేదో మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలకు కోట్లు తెచ్చి పెట్టే స్కీమ్ అన్నట్లుగా కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్న వైసీపీ నేతలు… ఇప్పుడు సెంటిమంట్ పెంచడానికి అవసరమైతే రాజీనామా అనే ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది.
నిజానికి చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు ఎన్నో సార్లు మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం రిఫరెండం కోసం ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. కానీ ఎప్పుడూ వైసీపీ నేతలు పట్టించుకోలేదు.కానీ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో ఉండగా ఇప్పుడు అవసరమైతే రాజీనామాలు అనే ప్రకటనలు చేయడం వైసీపీలోనూ ఇదేదో తేడాగా ఉందే అన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. మూడు రాజధానుల సెంటిమెంట్‌ను పెంచి… ఆ ఎజెండాపై ఎన్నికలకు వెళ్లిపోవాలని వైసీపీ హైకమాండ్ తాజాగా నిర్ణయించుకుందని అందుకే ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయిస్తోందని అంటున్నారు.
ప్రజల నుంచి కనీస మాత్రం స్పందన కనిపిస్తే మీడియా, సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేసి .. ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమం వర్కవుట్ కాలేదని తేలిన తర్వాత అభివృద్ధిపూర్తిగా ఆగిపోయిన సందర్భంలో.. ఇప్పుడు భావోద్వేగాలను తప్ప.. దేన్ని నమ్ముకున్నా మట్టే మిగులుతుందన్న అంచనాకు అధికార పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుముందు ఈ రాజీనామాల సవాళ్లు పెరిగితే మాత్రం.. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.