రీ మిక్స్ చేస్తే యూట్యూబ్ లో మోత మోగాలి. అన్నట్టే మోత మోగింది. యోయో హనీసింగ్ రీ మిక్స్ సాంగ్ ధీరే ధీరేసే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అప్పుడే దాన్ని 40 లక్షల మంది చూసి ఎంజాయ్ చేసేశారు. బాలీవుడ్ ప్రఖ్యాత తారలు హృతిక్ రోషన్, సోనమం కపూర్ ఇందులో ప్రత్యేకంగా నటించారు. వారిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ చాలా పాపులారిటీ తెచ్చింది. ఇద్దరి రొమాంటిక్ నటన ఈ పాటకు హైలైట్ అంటున్నారు చూసిన వారు.
25 ఏళ్ల క్రితం, 1990లో ఆఖిషీ సినిమాలో ఇది సూపర్ హిట్ పాట. దీన్ని ఇప్పుడు హనీసింగ్ రీమిక్స్ చేశాడు. మాంచి మ్యూజిక్ తో పాటు హృతిక్ లాంటి హ్యాండ్సమ్ హీరో, సోనం లాంటి క్యూట్ బ్యూటీ నటిస్తే ఇంకేముంది, అభిమానులకు కన్నుల పండగే. అందుకే ఈ సాంగ్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఈనెల 1న దీన్ని అప్ లోడ్ చేశారు. నాలుగు రోజులు పూర్తిగా గడవక ముందే నాలుగు మిలియన్ల ప్రేక్షకులు దీన్ని చూసి ఆనందించారని హనీ సింగ్ ఖుషీ అవుతున్నాడు.
హృతిక్, సోనమ్ లు కూడా వీక్షకులు ధన్యావాదాలు చెప్పారు. ఈ పాటను ఇంత బాగా ఆదరిస్తారని ఊహించలేదని వారిద్దరూ సంబరపడుతున్నారు. ఈ పాట ఇంత హిట్ కావడానికి హృతిక్, సోనమే కారణమంటూ వారికి హనీ సింగ్ థ్యాంక్స్ చెప్తున్నాడు.
[youtube http://www.youtube.com/watch?v=nCD2hj6zJEc&w=853&h=480]