అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి వాషింగ్టన్ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని కమ్యూనిటీనిమహాసభల్లో పాల్గొనే విధంగా ఎన్నో కార్యక్రమాలను, పోటీలను తానా నిర్వహిస్తోంది. అందులో ధీంతానా కూడా ఒకటి. మీపాట, మీ ఆట, మీ అందానికి గుర్తింపు ఇచ్చేలా ఈ పోటీలను ధీంతానా పేరుతో నిర్వహిస్తోంది. సోలో సింగింగ్, గ్రూపుడ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పేరుతో నిర్వహించే ఈ పోటీల్లో 5 సంవత్సరాల వయస్సు నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారంతా పాల్గొనవచ్చు.
తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఆధ్వర్యంలో ధీంతానా కమిటీ చైర్ శ్రీమతి సాయిసుధ పాలడుగు పర్యవేక్షణలో దాదాపు 18 నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి రీజియన్‌లో జరిగే పోటీల్లో ప్రతి విభాగంలోనూ ఇద్దరిని విజేతగా ఎంపికచేస్తారు. ప్రాంతాలవారీగా గెలిచిన విజేతలందరూ తానా మహాసభల్లో (TANA conference) జరిగే ఫైనల్ పోటీలకు అర్హులవుతారు. ఫైనల్ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి పారితోషికంతోపాటు సెలబ్రిటీ నుంచి మీ బహుమతిని అందుకునేఅవకాశం లభిస్తుంది.
సింగింగ్ పోటీలను శాస్త్రీయ-సినిమా-జానపద విభాగాలుగా వర్గీకరించి, సబ్ జూనియర్స్ (9 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు), జూనియర్స్ (9-14 వయస్సుకలవారికి), సీనియర్స్ (15-25 వయస్సు కలవారికి) కేటగిరిలో పోటీలనునిర్వహిస్తున్నారు. విన్నర్‌కు, ఫస్ట్ రన్నరకు తానా మహాసభల్లో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. అందానికి సంబంధించి నిర్వహించే పోటీలను టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో విజేతలుగా నిలిచినవారికికూడా తానా మహాసభల్లో ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. డ్యాన్స్ పోటీలను కూడా 3 విభాగాలుగా వర్గీకరించి నిర్వహిస్తున్నారు. శాస్త్రీయ, సినిమా, జానపద నృత్యాలను ఇందులో ప్రదర్శించవచ్చు. సబ్ జూనియర్స్ (9 సంవత్సరాలోపు వయస్సుఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు), జూనియర్స్ (9-14 వయస్సుకలవారికి), సీనియర్స్ (15-25 వయస్సు కలవారికి) కేటగిరిలో పోటీలను ఏర్పాటు చేశారు. కపుల్ డ్యాన్స్ పోటీల్లో 45 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్నవారు పాల్గొనవచ్చు.విన్నర్‌కు, ఫస్ట్ రన్నరకు మహాసభల్లో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.
ఏఏ నగరాల్లో…
శాన్ఫ్రాన్సిస్కోలో ఏప్రిల్ 6వ తేదీన ధీంతానా పోటీలు ప్రారంభమయ్యాయి. మిల్పిటాస్లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. విజయ ఆసూరి, సతీష్ వేమూరి, రజనీకాంత్ కాకర్ల, వీరు ఉప్పల,శ్రీకాంత్దొడ్డపనేని, మధురావెల, యశ్వంత్ కుదరవల్లి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎంతోమంది ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అప్పాచియాన్ ప్రాంతంలో జరిగిన ధీమ్‌తానా పోటీల్లో ఎంతోమంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఏప్రిల్ 27వ తేదీన జరిగిన ఈ పోటీలు తానా రాలే సిటీ కో ఆర్డినేటర్ పూర్ణచంద్ర కొండ్రకుంట ఆధ్వర్యంలో జరిగింది. విజేతలుగా నిలిచినవారికిమెమోంటోలతోపాటు, వాషింగ్టన్ డీసిలో జరిగే తానా మహాసభలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. సీటెల్ నగరంలో కూడా ధీంతానా పోటీలు వైభవంగా జరిగాయి. ఇలాగే మిగతా చోట్ల కూడా ధీంతానా పోటీలను పెద్దఎత్తుననిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
సియాటెల్‌లో థీమ్ తానా (North American Telugu community) వేడుకలు మే 5వ తేదీన వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో దాదాపు 120 మందికిపైగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ వేడుకలను తిలకించడానికి ఎంతోమందివేడుకల ప్రాంతానికి తరలివచ్చారు. సియాటెల్ సిటీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అబ్బూరి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
ఫిలడెల్పియా, చికాగోలో మే 18వ తేదీన, న్యూజెర్సి నగరంలో మే 19న, క్లీవ్‌లాండ్, హ్యూస్టన్, లాంగ్‌ఐలాండ్‌లో జూన్ 1వ తేదీన పోటీలు జరగనున్నాయి. సెయింట్‌లూయిస్, అట్లాంటా, మిన్నెసొటాలో జూన్ 2వ తేదీన పోటీలను ఏర్పాటు చేశారు.లాస్ ఏంజెలిస్, బోస్టన్, వాషింగ్టన్ డీసిలో జూన్ 8వ తేదీన పోటీలను నిర్వహిస్తున్నారు.
ఆయా నగరాల్లో ఉన్నవారు ఈ పోటీల్లో పాల్గొనాలంటే వెంటనే తమ పేర్లను ఆయా ప్రాంతాల్లో ఉన్న కో ఆర్డినేటర్లను సంప్రదించి ఇవ్వాల్సిందిగా ధీంతానా కమిటీ కోరుతోంది. ఈ కో ఆర్డినేటర్ల ఫోన్ నెంబర్లను కూడా తానా మహాసభల వెబ్సైట్లోఇవ్వడం జరిగింది (TANA conference website).
మీ ప్రతిభను ప్రదర్శించండి – సతీష్ వేమన
అమెరికా నలుమూలలా తెలుగువారు అన్నీ రంగాల్లో ముందుకు వెళుతున్నారు. మన పిల్లలు ఎంతోమంది శాస్త్రీయ, జానపద, సినిమా పాటలను పాడటంలో ఆసక్తిని చూపుతున్నారు. ఎంతోమంది గురువుల దగ్గర విద్యను నేర్చుకుంటున్నారు.ఇలాంటివారిని గుర్తించి వారి ప్రతిభను బయటకు తేవడానికి ఈ ధీంతానా పోటీలు ఉపయోగపడుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా మీ ప్రతిభను బయటకు చాటి చెప్పడానికి ముందుకు రావాలని తానా కోరుకుంటోంది. అలాగేడ్యాన్స్,అందాల పోటీల్లో కూడా మీరంతా పాల్గొని జయప్రదం చేయాలి.
ఎందరికో స్ఫూర్తినిస్తున్న పోటీలు – సాయిసుధపాలడుగు
తానా నిర్వహిస్తున్న ధీంతానా పోటీలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అందాల పోటీల్లో పాల్గొనేందుకు సాధారణంగా మనవాళ్ళు పెద్దగా ఉత్సాహం చూపరు. కాని తానా ఇస్తున్న ప్రోత్సాహం, స్ఫూర్తి కారణంగా ఇప్పుడు అందాల పోటీల్లోపాల్గొనేందుకు ఎంతోమంది మనవాళ్ళు ముందుకు వస్తున్నారు. తానా పోటీల్లోనే కాకుండా, అమెరికా నగరాల్లో నిర్వహించే వివిధ అందాల పోటీల్లో మనవాళ్ళు పాల్గొని అందాల సుందరి కిరీటాన్ని దక్కించుకుంటున్నారు. ఇది ఎంతోసంతోషకరమైన విషయం. అలాగే పాటలు పాడటంలో స్థానిక టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తానా ఎల్లప్పుడు ముందుంటుంది.
తానాలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నిర్వహించే మహాసభల్లో జరిగే పోటీల్లో పాల్గొనడమే ఆనందకరమైన విషయం. అందులోనూ విజేతగా నిలిచినవారికి ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ ఆటను, పాటను ప్రోత్సహించడంతోపాటు, మీప్రతిభను అందరికీ తెలియజేయడమే ఈ ధీంతానా పోటీల ముఖ్య ఉద్దేశ్యం. అన్నీ వయస్సులవారు పాల్గొనేలా పోటీలను తయారు చేశాము. అన్నీచోట్ల ఉన్న మన పిల్లల ప్రతిభకు పదును పెట్టేలా ఉన్న ఈ పోటీల్లో అందరూ పాల్గొనండి. ధీంతానాకమిటీ ఆర్మీలాగా పనిచేస్తూ, పోటీల నిర్వహణను విజయవంతగా నిర్వహిస్తోంది.
ఈ పోటీలకు సంబంధించి మీకు కావాల్సిన సమాచారాన్ని అందిచేందుకు కమిటీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే ఆయా నగరాల్లో ఉన్న ధీంతానా కో ఆర్డినేటర్ల ఫోన్ నెంబర్లను ఫ్లయర్ ద్వారా అందరికీ తెలియజేశాము.
ఇంకా వివరాలు కావాలంటే 703 282 7308 నెంబర్‌కు ఫోన్ చేయండి.
తానా మహాసభల్లో ఏర్పాటు చేస్తున్న ఇతర కార్యక్రమాలు, పోటీలు, ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న అతిధులు, ఇతర వివరాలకోసం సందర్శించండి: www.tana2019.org.
Press release by: Indian Clicks, LLC