ఆదివారం.. వాఖండే స్టేడియం.
హార్దిక్ పాండ్యా బౌలింగ్.
20వ ఓవర్ జరుగుతోంది.
చెన్నై బ్యాట్స్‌మెన్ మిచెల్ ఔటయ్యాడు.
అంతే స్టేడియం దద్దరిల్లింది. చెన్నై ఆటగాళ్లు కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఎందుకంటే… ఎవరు ఔటౌనా ఆ సమయంలో ధోనీ క్రీజ్‌లోకి వస్తాడు. ఉన్నవి నాలుగు బంతులే. అవి చాలు. ధోనీ ఆట చూడడానికి. అనుకొన్నట్టే.. ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎదుర్కొన్నవి నాలుగు బంతులే. అందులో మూడింటికి స్టాండ్స్‌లోకి పంపాడు. తొలి మూడు బంతులూ మూడు సిక్సర్లు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ని కకలావికలం చేసి, చెన్నై స్కోరుని అమాంతంగా 200 దాటించాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగుల చేసి.. ధోనీ తన తఢాకా చూపించాడు. అప్పటి వరకూ చెన్నై ఇన్నింగ్స్ ఒక ఎత్తు. ఆ నాలుగు బంతులూ మరో ఎత్తు. ఈ తేడానే… మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ ఇలానే చెలరేగిపోయాడు. చివర్లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా, ధోనీ ఇన్నింగ్స్ ఆ లోటేం కనిపించకుండా చేసింది. ధోనీ వికెట్ల వెనుక కూడా చాలా చురుగ్గా కదులుతున్నాడు. గైక్వాడ్ కెప్టెన్ అయినా, ధోనీనే జట్టుని నడిపిస్తున్న ఫీలింగ్ వస్తోంది. బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ సెట్ చేయడం ఇవన్నీ ధోనీనే చూసుకొంటున్నాడు. ధోనీ ఇలానే ఫిట్నెస్ కొనసాగిస్తే, ఇదే ఫామ్ లో ఉంటే.. తదుపరి ఐపీఎల్ లోనూ ధోనీని చూడొచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
మొత్తానికి చెన్నై.. పటిష్టమైన ముంబైని ఓడించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ముంబై మాత్రం చివరి నుంచి మూడో స్థానంతో సరిపెట్టుకొంది.