గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ ఇచ్చిన షాకులతో తల్లడిల్లిపోతున్నాడు మెగా హీరో రామ్‌చరణ్. అందుకే… ఎలాంటి రిస్కూ లేని తనిఒరువన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎలా తీసినా.. ఈ సినిమా కనీసం యావరేజ్ అయినా అవుతుందన్నది చరణ్ నమ్మకం. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని చరణ్ ఫిక్సయ్యాడు కూడా. అయితే తనివరువన్ బండి అంత సజావుగా సాగడం లేదని టాక్. షూటింగ్ పోగ్రెస్ పట్ల చరణ్ ఏమాత్రం సంతృప్తిగా లేడట. ఇప్పటికే సగం సినిమా పూర్తికావాల్సి ఉండగా.. పావు వంతు కూడా ఫినిష్ అవ్వలేదని తెలుస్తోంది. అందుకే సురేందర్ రెడ్డిపై చెర్రి యమ సీరియస్‌గా ఉన్నాడని టాలీవుడ్ టాక్.
ఈ సినిమా అనుకొన్నదానికంటే ఆలస్యంగా మొదలైంది. దానికి కారణం.. సూరినేనట. రీమేక్ కథని తెలుగులో మక్కీకి మక్కీ దించకుండా తనవంతు సైడ్ డిషెష్ యాడ్ చేసుకొంటూ వచ్చాడట. అవి.. చరణ్‌కి నచ్చలేదని, దాంతో మళ్లీ స్క్రిప్టు మారిందని సమాచారం. పాటల ప్లేస్మెంట్ విషయంలోనూ చరణ్‌కీ, సూరికీ మధ్య అభిప్రాయ బేధాలొస్తున్నట్టు తెలుస్తోంది. తని ఒరువన్లో పాటలకు స్కోప్ తక్కువ. మసాలా అంశాలూ లేవు. వాటిని రీమేక్ లో చేర్చాలని పట్టుపడుతున్నాడట చరణ్. అలాంటి యాడింగులతో సినిమా ఫ్లేవర్ పోతుందని సూరి చెబుతున్నాడట. పైగా మేకింగ్ పేరుతో రోజుల తరబడి ఒకే సీన్ చేసుకొంటూ వెళ్లడం చరణ్‌కి నచ్చడం లేదని తెలుస్తోంది. సినిమా స్పీడప్ చేయమని చరణ్ పోరు పెడుతున్నాడట. సూరి తీరు చూస్తుంటే ఈ సినిమా దసరాకి రావడం అనుమానమే. అందుకే చరణ్ అంత టెన్షన్ పడుతున్నాడట. ఇప్పటికైనా చకచక పూర్తి చేస్తే.. చరణ్ టెన్షనే కాదు, మెగా ఫ్యాన్స్ టెన్షన్ కూడా తగ్గిపోతుంది.