ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని కాపాడుకునేందుకు .. అమూల్‌ను ఢీకొట్టేందుకు రంగంలోకి దిగిపోయారు. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన… సంగం డెయిరీలోని కీలకమైన వ్యక్తులందరిదో సంప్రదింపులు జరిపారు. అమూల్‌కు పాలు పోయాలని సంగం డెయిరీకి చెందిన రైతులపై వస్తున్న ఒత్తిడి గురించి ఆయన పూర్తిగా అర్థమైంది. దీంతో… లీటర్‌కు రూ. నాలుగున్నర చొప్పున అధికంగా రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. పాల సేకరణ ధరను పెంచడమే కాదు… పాడి రైతుల కోసం మరికొన్నిచ ర్యలు తీసుకున్నారు.
అమూల్‌కు ప్రభుత్వం ఎక్కడా లేని ప్రోత్సాహం ఇస్తోంది. లీటర్‌కు నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తామని చెబుతోంది. అమూల్‌కు పాలు పోస్తే.. ప్రభుత్వం రూ. నాలుగు బోనస్ ఇస్తామని చెప్పడంపై చాలా మందికి విస్మయం వ్యక్తంఅయినా… అమూల్‌ను ఏపీ సర్కార్ ప్రమోట్ చేస్తున్న విధానం చూసిన తర్వాత అందరికీ పరిస్థితి అవగతమైంది. సంగం డెయిరీ రైతుల్ని గందరగోళపరిచి.. వారందరితో అమూల్‌కు పాలు పోసేలా చేస్తే.. సంగం డెయిరీ నిర్వీర్యం అయిపోతుందన్న అంచనాతోనే.. ప్రస్తుతం… అమూల్‌ను ప్రమోట్ చేస్తున్నారని సంగం డెయిరీ యాజమాన్యం నమ్ముతోంది. దీంతో… శక్తికి మించి అయినా ప్రభుత్వంతో పోరాడటానికి… రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు.
సంగం డెయిరీలో అవకతవకలంటూ … ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఆ పేరుతో కేసులు పెట్టి… ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టి… సంగం డెయిరీ మొత్తాన్ని సోదా చేశారు. చివరికి మార్కెటింగ్ డేటా కూడా… తీసుకున్నారు. అయితే.. ఇంత వరకూ అధికారికంగా ఫలానా దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పలేకపోయారు. ధూళిపాళ్లకు వ్యక్తిగతంగా లబ్ది చేకూరిందని ఎక్కడా నిరూపించలేకపోయారు. ఈ క్రమంలో సంగం డెయిరీని కాపాడుకునేందుకు ధూళిపాళ్ల మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.