నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ‘లౌక్యం’వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా….
కో ప్రొడ్యూసర్, చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘నందమూరి బాకృష్ణగారి 99వ చిత్రం ‘డిక్టేటర్’ గురించి నందమూరి అభిమానులు, ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. సినిమా టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. నందమూరి అభిమానులు బాలకృష్ణను ఎలా చూడానుకుంటున్నాడో అలాంటి కథ. డిఫరెంట్‌గా ఉంటూనే ఇప్పటి వరకు బాలకృష్ణగారు చూడని స్టయిలిష్ యాంగిల్ కనపడతారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త సబ్జెక్ట్. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ సంస్థతో పాటు ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో మా వేదాశ్వ క్రియేషన్స్ పార్ట్ కావడం ఆనందంగా ఉంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ ఎక్సలెంట్. థమన్ ఎలాంటి మ్యూజికల్ హిట్స్ చేశాడో మనకు తెలిసిందే. బాలకృష్ణగారితో థమన్ చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఎక్సలెంట్ ట్యూన్స్ అందించాడు. వినాయక చవితినాడు విడుదల చేసిన గణపతి పాటకు మంచి రెప్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా ఫస్ట్ లుక్ ను అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పలువురి ప్రముఖు ఆధ్వర్యంలో డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. సినిమా రీసెంట్గా ఢిల్లీ, హర్యానాల్లోని బ్యూటిఫుల్ లోకేషన్స్‌లో బాలకృష్ణ, అంజలి, అక్ష, సుమన్ తదితరులు పాల్గొనగా చిత్రీకరణను పూర్తి చేశాం. దీందో టాకీపార్ట్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణగారు అందించిన సహకారంతో సినిమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
సుమన్, పవిత్రాలోకేష్, నాజర్, వెన్నెకిషోర్, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రమ్ జీత్, అజయ్ తదితయి ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ ఇంరట్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్.