షిరిడికి వెళ్లవద్దు.. అంత కంటే గొప్పగా తాను గుడి కట్టా.. అందరూ తన గుడికే వచ్చేయమంటున్నారు మోహన్ బాబు. సాయిబాబా పై భక్తితో ఆలయం నిర్మించిన వారు ఇలా కూడా మాట్లాడతారా అని ఆశ్యర్యపోయే రీతిలో మాట్లాడుతున్నారు. సినీ నటుడు మంచుమోహన్ బాబు తిరుపతి సమీపంలో తమకు ఉన్న విద్యాలయాల దగ్గర షిరిడి సాయి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాము నిర్మించిన ఆలయం షిరిడి కన్నా గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది.
ఇకపై ఎవరూ షిర్డీకి వెళ్ళాల్సిన అవసరంలేదని, రుషికేష్ సహా అనేక పవిత్ర స్థలాల నుంచి మూలికలు, చెక్కలు తీసుకొచ్చి ఆలయంలో పీఠం కింద ఉంచామని, ఇంత పవిత్రమైన ఈ ఆలయం నిర్మించడంతో ఇక సాయి నాధుని భక్తులు ఎవరూ షిరిడి ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై సోషల్మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆలయ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో షిరిడికి కూడా భక్తులు వెళ్లొద్దని.. తమ ఆలయానికే రావాలని చెప్పుకోవడం వివాదాస్పదమవుతోంది. అంతే కాదు శ్రీవారి భక్తులందరూ.. శ్రీవారి దర్శనం తర్వాత తమ గుడికి రావాలంటున్నారు.
షిరిడి సాయినాథునిపై భక్తితో ఆలయాన్ని నిర్మించడం మంచిదే కానీ ఇలా.. తమ ఆలయమే గొప్ప అని.. ఇతర సాయినాధుని ఆలయాలకు వెళ్లవద్దని చెప్పడం ఏమిటనేది భక్తులకు అర్థం కాని విషయం. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి.. షిరిడిని మంచిన ఖర్చుతో కట్టేస్తే అది షిరిడి కంటేపెద్ద ఆలయం అవుతుందా..? అలా అవుతుందని ఆలోచించేవారు ..భక్తులు ఎందుకు అవుతారు..భక్తి వ్యాపారం చేసే వారు అవుతారు కానీ. మోహన్ బాబు ఇప్పుడు ఇదేకేటగిరిలో చేరిపోయారు.