సినీ నిర్మాత బండ్ల గణేష్ రివర్స్‌లో పొట్లూరి వరప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. చెక్కుల బౌన్సింగ్ వ్యవహారంపై… పీవీపీ కోర్టు కెళ్లారు.. ఆ కేసు కొట్టేశారని బండ్ల గణేష్ చెబుతున్నారు. పీవీపీ తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకుని ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పీవీపీతో వివాదం గురించి.. మొత్తం పోలీసులకు వివరించారు. కోర్టులో కొట్టి వేసిన కేసని వివరించారు. తనకు నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందని బండ్ల గణేష్ మీడియాకు చెప్పారు. తాను పీవీపీని బెదిరించలేదని.. తననే పీవీపీ బెదిరించారని గణేష్ ఆరోపిస్తున్నారు. విజయవాడ మొత్తం నా చేతుల్లో ఉంది.. నేనేం చెబితే అదే జరుగుతుందని.. పీవీపీ తనను బెదిరించినట్లు బండ్ల గణేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఇంటికి వచ్చి పీవీపీ మనుషులు రెక్కీ చేసి వెళ్లారని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత తనపై వేధింపులు పెరిగాయన్నారు. ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీని పిలిచించి మాట్లాడతామని పోలీసీలు హామీ ఇచ్చారని బండ్ల గణేష్ చెబుతున్నారు. అంతకు ముందు ఉదయం… బండ్ల గణేష్ మరో నలుగురితో కలిసి తన ఇంటికి వచ్చి… బెదిరించారని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వివాదంలో.. అసలు కేసు కోర్టులో ఉందని చెబుతున్నారు. కోర్టులో కేసు పరిష్కరించుకునేందుకు… డబ్బులు ఇవ్వాలని పీపీపీ ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత …ప్రభుత్వం పేరు చెప్పి కూడా బండ్ల గణేష్‌ను హెచ్చరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బండ్లపై ఒత్తిడి ఎక్కువయిందని…కూడా అంటున్నారు. గతంలో.. వివాదాలపై కోర్టుకెళ్లినా ఇప్పుడు మాత్రం.. సెటిల్మెంట్ల కోసం.. ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. పీవీపీ కొద్ది రోజుల క్రితం..తన సంస్థలో పని చేసే ఉద్యోగినే కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బండ్ల గణేష్ వివాదంతో మరోసారి తెరపైకి వచ్చారు.