ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడానికి సమాజ్ వాదీ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వెళ్లాయా ?. ఇలా వెళ్తాయని ఇప్పటి వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలే ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యూపీలో బీజేపీని ఓడించడానికి తెలంగాణ రాష్ట్రసమితితో పాటు వైసీపీ కూడా డబ్బులు పంపిందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటున్నారు. అన్ని లెక్కలు బయటకు తీస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలకు ఆర్థిక సాయం చేసిందన్న ప్రచారం జరిగిది.
అయితే అవిచిన్న రాష్ట్రాలు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడే పార్టీకి కూడా ఆర్థిక సాయం చేస్తుందా .. అన్నది కాస్త సందేహించాల్సిన విషయమే. అదే సమయంలో వైసీపీ అలాంటి ప్రయత్నమే చేయదని.. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేసే పరిస్థితిలో లేదని కొంత మంది భావిస్తున్నారు. అయితే యూపీలో బీజేపీ ఓడిపోతే..బీజేపీ తమపై కాస్త ఎక్కువగా ఆధారపడుతుందని.. అది తమకు బాగా కలసి వస్తుందని లెక్కలు వేసుకున్నట్లుగా మాత్రం ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇరప్పుడు ఆర్థిక సాయం కూడాచేసినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే నిజం అయితే మాత్రం వైసీపీ బీజేపీకిపూర్తి స్థాయిలో శత్రువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటికే రాజకీయ శత్రువుగా వ్యవహరిస్తోంది. ఒక వేళ డబ్బులు పంపినలెక్కలు కేంద్రం వద్ద ఉంటే మాత్రం… పరిస్థితిని చూసి.. ఐటీ, ఈడీలు రంగంలోకిదిగే అవకాశం ఉంది. ఏ ఏ సంస్థల ద్వారా యూపీకి డబ్బులు తరలించారో లెక్కలు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే.. టీఆర్ఎస్, వైసీపీ నిండా మునిగిపోతాయి.