అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మహేష్-మురుగదాస్ సినిమా టైటిల్స్ ఇవీ అని బోలెడన్ని పేర్లు మన ముందుకు వస్తున్నాయి. అయితే ఆ టైటిల్స్ విషయంలో కనిపిస్తున్న ఓ కామన్ థింగ్ ఏంటంటే అవన్నీ కూడా మరీ పాత టైటిల్స్ అయి ఉండడం. మురుగదాస్ నిర్మాణంలో వచ్చిన సినిమాలు కానీ, దర్శకత్వంలో వచ్చిన సినిమాల టైటిల్స్ కానీ చాలా వరకూ ట్రెండీగా ఉంటాయి. సినిమాపైన చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇక మన సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.స్టైల్ ఐకాన్ అని పిలిపించుకోవాలని ఇష్టపడతాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ అంటే ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా మహేష్ బాబు కనిపిస్తాడని తెలుస్తోంది. తమిళ్ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆ మధ్య విజయ్‌తో చేసిన తుపాకి సినిమా స్టైల్లో ఈ సినిమా ఉండబోతోందట. హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్టైలిష్‌గా, ట్రెండీగా ఉంటుంది. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా రాబోయే సినిమాలకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని చెప్తున్నారు. మరి ఆ రేంజ్ సినిమాకు అభిమన్యుడు, కొలంబస్, ఏజెంట్ శివ లాంటి టైటిల్స్‌ని ఊహించుకోవాలంటేనే కష్టంగా ఉంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని కూడా టార్గెట్ చేసిన ఈ సినిమా టైటిల్ అల్ర్టా మోడర్న్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అన్నింటికీ మించి తెలుగు, తమిళ్, హిందీ భాషలన్నింటిలోనూ ఒకే టైటిల్‌తో సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మురుగదాస్ ఉన్నాడట. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ ఆడియన్స్‌ని కూడా అట్రాక్ట్ చేయాలంటే ఆ సినిమా టైటిల్ ఏ రేంజ్లో ఉండాలి?