ఏపీలో ఉన్న మద్యం పాలసీ, బ్రాండ్లతో మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని కొత్త నాసిరకమైన కొత్త బ్రాండ్ల మద్యంతో సామాన్య జనం అనారోగ్యానికి గురయ్యారు. చీప్ లిక్కర్ ను సైతం జగన్ సర్కార్ మద్యపాన నిషేధం పేరుతో కాస్ట్లీగా అమ్మేసింది. జగన్ ఓటమికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి.
ఇప్పుడు కొత్త సర్కార్ మద్యం పాలసీ మార్చబోతుంది. నాసికరం మద్యం బ్రాండ్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చి… ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు కొనుగోలు చేసేలా చేయబోతున్నారు.
కానీ, ఏపీలో మద్యం రేట్లు చాలా ఎక్కువ. పక్కనున్న తెలంగాణ, కర్నాటకతో పోల్చితే… మద్యం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. కొత్త మద్యం పాలసీలో రేట్లు తగ్గిస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ రెవెన్యూ గణనీయంగా పడిపోతుంది. అలాగని పాత రేట్లను సర్కార్ కంటిన్యూ చేస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
త్వరలో కొత్త మద్యం పాలసీ తీసుకరాబోతున్నామని… నాసికరం మద్యానికి ముగింపు పలుకుతామని అయితే సర్కార్ స్పష్టత ఇచ్చింది. కానీ, బ్రాండెడ్ మద్యం రేట్ల విషయమే క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ రూపోందించటం ప్రభుత్వానికి కత్తిమీద సామే అన్న అభిప్రాయం ఉంది. ప్రజారోగ్యానికి ఇబ్బంది లేకుండా కొత్త మద్యం పాలసీతో ఇటు ఆదాయాన్ని కూడా పెంచే మార్గాలే అన్వేషిస్తున్నామని, సీఎం రివ్యూ తర్వాత క్లారిటీ వస్తుంది అంటూ అబ్కారీ శాఖ పేర్కొంటుంది.