పులివెందుల వైసీపీ సోషల మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు వర్రాతో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేసి ముసుగులు కప్పి మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి వీరంతా జీతాలు తీసుకుని బూతు పోస్టులు పెట్టేవారని గుర్తించామని తెలిపరు. దీంతో ఈ కేసు బూతు పోస్టుల నుంచి.. కీలక అంశాల వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది వైసీపీ కార్యకర్తలకు బూతు పోస్టులు పెట్టేందుకు, మార్ఫింగ్లు చేసేందుకు, అప్పటి ప్రతిపక్ష నేతల కుటుంబాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు జీతాలు ఇచ్చేవారు. వర్రా రవీందారెడ్డితో పాటు ఇంటూరి రవి కిరణ్ కూడా పే రోల్ లో ఉన్నారు. మొత్తంగా యాభై వరకూ యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కార్యకర్తలకూ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్లుగా గుర్తిస్తున్నారు. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరిగితే చాలాపెద్ద కేసు అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అసలు ఇలాంటి సైకో పనులు చేయడమే తప్పు అయితే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి పోస్టులు పెట్టించడం సంచలనంగా మారింది. ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఖచ్చితంగా ఉందని అనుమానాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన ఆర్జీవీకి కూడా ఎన్నికలకు ముందు డబ్బులు చెల్లించారు. ఇవన్నీ బయటకు తీసి..అసలు తప్పుడు ప్రచారం.. పేక్ పోస్టుల కుట్ర ఏమిటో లెక్క తేల్చే అవకాశం ఉంది.