వందేళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పార్టీ రానురానూ టెర్రరిస్టులకు మిత్రపక్షంగా మారుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఉగ్రవాదాన్ని నూరిపోయడమే పనిగా పెట్టుకున్న వాడిని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పొగడిన వీడియో ఒకటి తాజగా బయటకు వచ్చింది. టెర్రరిజాన్ని పెంచి పోషించేలా ప్రవర్తిస్తున్న వాడిని కటకటాల్లోకి నెట్టాలిగానీ శాంతి దూత అని దిగ్విజయ్ సింగ్ కీర్తించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైనారిటీల ఓట్ల కోసం ముస్లిం ఉగ్రవాదుల మీద ఈగవాలనివ్వని విధానాన్ని ఆ పార్టీ వాళ్లు అనుసరిస్తుంటారు. పార్లమెంటుపై దాడికి సూత్రధారి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడానికి యూపీఏ పాలకులకు చేతులు రాలేదు. ఎక్కడ ముస్లిం ఓట్లు దూరమవుతోయోనని తాత్సారం చేస్తున్నారనే విమర్శలు రావడంతో చివరకు 2014 ఎన్నికలకు ముందు అతడికి తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలైంది. ముంబైలో దాడి చేసిన కసబ్ ను అదేదో స్వాతంత్ర్య సమరయోధుడు అన్నట్టు కోట్ల రూపాయలతో కట్టించిన ప్రత్యేక సెల్ లో ఉంచారు. బిర్యానీలు పెట్టి మేపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని హోం మంత్రులు, ఇతర శాఖల మంత్రులు ఉగ్రవాదులను గారు అని, జీ అని, సాహెబ్ అని సంబోధించడం పరిపాటి. లేకపోతే వాళ్లకు కోపం వస్తుందని భయమేమో. మొన్న ఢాకాలో ఉగ్రదాడి చేసిన ముష్కరులకు బ్రెయిన్ వాష్ చేసిన వాడు జకీర్ నాయక్ అనే విషయం మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులకు పక్కా దోస్తు అయిన నాయక్ ఎంతో మందిలో విషబీజాలు నాటాడు. ఉగ్రవాదులుగా మార్చాడు.
ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ ను పొగిడాడు. లాడెన్ ఉగ్రవాది కాదు ఓ మత ప్రబోధకుడని కీర్తించాడు. అంతేకాదు, భారత దేశంలోని ముస్లింలు అందరూ ఉగ్రవాదులుగా మారాలని పిలుపునిచ్చాడు. ముంబై సహా అనేక చోట్ల సభలు ఏర్పాటు చేస్తూ విషం కక్కే ప్రసంగాలు చేయడంలో ఆరితేరిన దేశ ద్రోహి. అలాంటి వాడిని దిగ్విజయ్ సింగ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 2012లో ముంబైలో ఓ సభలో నాయక్ తో వేదికను పంచుకున్నారు. పైగా అది తన అదృష్టమని ప్రకటించారు. నాయక్ శాంతి సందేశాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేస్తున్నారని కీర్తించారు. అప్పటికే నాయక్ లాడెన్ ను పొగిడాడు. ముస్లింలు టెర్రరిస్టులుగా మారాలని కామెంట్ చేశాడు. మరి దిగ్విజయ్ సింగ్ గారికి ఈ విషయాలు గుర్గు లేవేమో ముష్కర మూకను తయారు చేసే వాడిని పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్ పై విమర్శల దాడి మొదలైంది. బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గీ రాజా చేష్టలతో కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. అసలే పరాజయ పరంపరతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. అది టెర్రరిస్టుల అనుకూల పార్టీగా ముద్ర వేయడానికి కమలనాథులకు మరో అవకాశం లభించింది.