శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి గతేడాది ఆరు చిత్రాలు వచ్చాయి. అవన్నీ దిల్‌రాజుకి లాభాలు తెచ్చాయి. అంతేనా? ఆరు విజయాలను సిక్సర్‌గా వర్ణించారు దిల్‌రాజు. అయితే… ఓ చిత్రం లెక్కలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ‘దువ్వాడ జగన్నాథమ్’ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. దిల్‌రాజు ఆఫీసు ముందు కొందరు అభిమానులు హడావుడి చేశారు. అయినా దిల్‌రాజు ‘దువ్వాడ జగన్నాథమ్’ విజయం సాధించిందనే చెప్పారు. చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిందంటే ఒప్పుకునేవారు కాదు. ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో మాత్రం అంగీకరించారు.
“సినిమా విడుదలకు ముందు మా ఆర్టిస్టులు మామూలుగా మాట్లాడలేదు. కొడుతున్నాం.. కొడుతున్నాం.. అని గట్టిగా చెప్పారు. దాంతో ఆడియన్స్ హై ఎక్స్‌పెక్టెషన్స్ పెట్టుకుని థియేటర్లకు వచ్చారు. అందువల్ల మొదటి రోజు కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యూత్‌లో! ఈ రోజు అదే యూత్ సోషల్ మీడియాలో సినిమా బావుందని పోస్టులు పెడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం యునానిమస్‌గా బావుందని చెబుతున్నారు” అని దిల్‌రాజు మాట్లాడారు. సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందని ఒప్పుకున్నారు. గతేడాది ఆయనకు అన్నీ విజయాలు వస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన సినిమాలు రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ‘లవర్’ ఫలితాన్ని ఆయన ముందే ఊహించినట్టు వున్నారు. విడుదలకు ముందు నుంచీ “మేమెంత కష్టపడినా కదా” అని చెప్పేవారు. ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ ఫలితం మాత్రం దిల్‌రాజుకి కాస్త నిరాశ కలిగించిందేమో!!