దిల్‌రాజు నిర్మాతగా త్రివిక్రమ్ భారీ చిత్రం – ఈ ఎనౌన్స్మెంట్ ఎవ్వరినీ ఆశ్చర్యపరచలేదు. దిల్‌రాజుకి ఆ స్టామినా ఉంది. త్రివిక్రమ్‌తోనే కాదు, ఆయన ఏ దర్శకుడితో అయినా సినిమా చేయగలరు. అయితే.. ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యే ఛాన్సులెంత అన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ మూడేళ్లకు రెండు సినిమాలు అన్న పద్ధతిలో కొనసాగుతున్నారు. ఈ యేడాదికి సినిమా ముచ్చట అయిపోయినట్టే. 2017లో పవన్ కల్యాణ్ సినిమాతోనే సరిపోతుంది. ఆ తరవాత ఆయనకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాలి. సూర్యతోనూ ఓ సినిమా ఉంటుంది. ఆరెండు సినిమాలూ పూర్తయ్యే సరికి మరో మూడేళ్లు పడుతుంది.
పవన్ సినిమాని దిల్‌రాజు ఖాతాలో వేసుకోవడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే హారిక, హాసిని సంస్థ ముందే కర్చీఫ్ వేసేసింది. ఇక.. మహేష్‌బాబు అంటారా? ఆయన ఎంబీ కార్పొరేషన్ ఉండనే ఉంది. మహేష్ బాబు చేతిలో చాలామంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు పెట్టున్నారు. అలాంటప్పుడు ఆ సినిమా దిల్‌రాజు చేతికి చిక్కడం అంత తేలికైన విషయం కాదు. ఇక సూర్య సినిమాకీ అదే పరిస్థితి. అంటే. దిల్‌రాజు – త్రివిక్రమ్ కాంబినేషన్ వర్కవుట్ అయ్యే శాతం తక్కువగానే ఉందన్నమాట. కాకపోతే పవన్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు దిల్‌రాజు. ఆ విషయం పవన్ ముందుకీ తీసుకెళ్లాడు. మంచి కథ తీసుకురండి.. అప్పుడు చేద్దాం అని మాటిచ్చాడు పవన్. ఆ మాట పట్టుకొనే.. త్రివిక్రమ్‌ని ఒప్పించడానికి ఇలా ముందే ఓ కర్చీప్ వేశాడన్నమాట. హారిక హాసిని సంస్థకు త్రివిక్రమ్ హ్యాండిస్తే తప్ప.. దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు.