’96’ సినిమాని రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్ రాజులో ఎన్ని ఆలోచనలో. త్రిష పాత్ర కోసం సమంతని ముందే ఫిక్సయిపోయాడు దిల్ రాజు. అయితే… విజయ్‌సేతుపతి పాత్ర కోసం మాత్రం చాలా ఆప్షన్లు రాసుకున్నాడు. అందులో… అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. బన్నీకి `96` సినిమాని కూడా చూపించాడు దిల్ రాజు. ఆ సినిమా నచ్చితే గనుక.. బన్నీతో లాగించేద్దామని అనుకున్నాడు. కానీ బన్నీ మాత్రం సినిమా చూసి `బాగుంది.. క్యారీ ఆన్..` అని చెప్పాడు గానీ, ‘నేను చేస్తా’ అని మాట ఇవ్వలేదు. దాంతో చివరి ఆప్షన్‌గా శర్వానంద్‌ని అనుకుని, శర్వానంద్‌తో ఓకే చేయించుకున్నాడు దిల్ రాజు. `బన్నీకి చూపించింది సలహా కోసమే. అయితే తానని ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తే.. చేస్తాను అని అంటే.. నాకు హ్యాపీనే కదా, అందుకే ఓ రాయి వేశా` అంటూ ఆ సీక్రెట్ మీడియా ముందు కూడా ఒప్పేసుకున్నాడు. అంతకు ముందే ఈ సినిమాని నానికి చూపిస్తే… ‘అసలు తెలుగులో ఈ సినిమా చేయొద్దు’ అంటూ సలహా ఇచ్చాడట. ఇక హీరోగా ఎందుకు ఒప్పుకుంటాడు? మరి ఈ ఇద్దరినీ దాటుకుని వచ్చిన సినిమాని శర్వానంద్ ధైర్యం చేసి, చేసేశాడు. మరి రిజల్ట్ మాటేమిటో తెలియాలంటే ఈనెల 7 వరకూ ఆగాలి.