కమెడియన్ వేణు దర్శకుడిగా చేసిన చిత్రం బలగం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషన్స్ ని కనెక్ట్ చేయడంలో దర్శకుడిగా వేణు విజయం సాధించాడు. ఈ సినిమా నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరు తీసుకొచ్చింది. తెలంగాణకి చెందిన దిల్ రాజు.. ఆ ప్రాంతం మూలాల్లోకి వెళ్లి ఈ కథని చూపించారని ఆయనకు అభినందనులు తెలుపుతున్నారు. బిజినెస్ పరంగా కూడా బలగం దిల్ రాజు కి సేఫ్ ప్రాజెక్ట్. ఈ సినిమాకి అవార్డులు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా వుంది.
ఇదీలావుంటే వేణుకి మరో అవకాశం ఇచ్చారు దిల్ రాజు. బలగం సినిమా షూటింగ్ జరుగుతున్నపుడే మరో లైన్ ని చెప్పారు. ఆ లైన్ దిల్ రాజు కి నచ్చింది. ఇటివలే ఆ లైన్ కి సంబధించిన పూర్తి కథ చెప్పడం, క్లైమాక్స్ తో సహా మొత్తం కథ నచ్చడంతో మరో ఆలోచన లేకుండా వేణుకి మరో అవకాశం ఇచ్చారు దిల్ రాజు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు చెప్పారు.