దిల్ రాజు పవన్ కల్యాణ్ అభిమాని అన్న సంగతి `వకీల్ సాబ్` రిలీజ్ రోజునే తేలిపోయింది. థియేటర్లో సినిమా చూస్తూ… నిర్మాత అన్న సంగతి మర్చిపోయి, పేపర్ ముక్కలు విసిరి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు దిల్ రాజు. పవన్ తో సినిమా చేయడం తన కల. అది… `వకీల్ సాబ్`తో తీరిపోయింది. అయితే.. ఇప్పుడు పవన్ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి పవన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడు.
పవన్‌పై దిల్ రాజుకి ప్రేమ పెరగడానికి, తనపై అభిమానం రెట్టింపు అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. `వకీల్ సాబ్` సినిమా అంతా పూర్తయ్యాక.. దిల్ రాజుని పిలిపించాడట పవన్. `సినిమా ఆడితే ఫర్వాలేదు.. ఆడకపోతే… డబ్బులు సర్దుబాటు చేస్తా. కావాలంటే మీతో మరో సినిమా చేస్తా` అని మాటిచ్చాడట. అదిగో… ఆ మాటకే దిల్ రాజు మళ్లీ ఫిదా అయిపోయాడు. ప్రీ రిలీజ్ రోజున.. వేదికపై పవన్ గురించి మాట్లాడుతూ దిల్ రాజు భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. దానికి కారణం అదే. సినిమా హిట్టయ్యింది. కరోనా ప్రభావంతో వసూళ్లు తగ్గినా, నిర్మాతగా తాను, బయ్యర్లూ సేఫ్. అందుకే.. ఇప్పుడు అర్జెంటుగా పవన్‌తో మరో సినిమా ఫిక్స్ చేసేశాడు. ఈమధ్య కాలంలో పవన్ కి భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చిన నిర్మాత దిల్ రాజునే. వకీల్ సాబ్ కి రూ.50 కోట్లకు పైగానే పారితోషికం ముట్టజెప్పాడట. ఈసారి అది ఇంకాస్త పెరిగిందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.