పటాస్‌తో ఫామ్ లోకి వచ్చాడు కల్యాణ్ రామ్. ఎం.ఎల్.ఏ కూడా మంచి వసూళ్లనే అందుకుంది. ఇప్పుడు `నా నువ్వే` అంటూ ఓ లవ్ స్టోరీ చెప్పబోతున్నాడు. తమన్నా కథానాయిక కావడం, పీసీ శ్రీరామ్ లాంటి టెక్నీషియన్ల అండ దండ ఈసినిమాకి ఉండడం కలిసొచ్చే విషయం. ‘న్యూ ఏజ్ లవ్ స్టోరీ’లాంటి ఈ సినిమాపై కాస్తో కూస్తో అంచనాలున్నాయి. అయితే మరీ క్లాస్ లుక్‌లో కనిపించడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. పటాస్, ఎం.ఎల్.ఏ రెండూ మాస్ కమర్షియల్ కథలే. ఈసారి మాత్రం ఓ లవ్ స్టోరీ ఎంచుకున్నాడు. అందుకే… రావల్సినంత హైప్ ఈ సినిమాకి రాకుండా పోతోందేమో అనిపిస్తోంది. ‘నా నువ్వే’ని నైజాంలో దిల్ రాజు చేతుల్లో పెట్టాలని చిత్రబృందం భావించింది. దిల్ రాజు ఉంటే… బ్రాండ్ పరంగా తమ సినిమాకి హెల్ప్ అవుతుందనుకున్నారు. అయితే రాజు మాత్రం ఈసినిమాని లైట్ తీసుకున్నాడట. ”కాలా`ని ఎలాగూ నైజాంలో నేనే విడుదల చేస్తున్నా కదా, ఒకేసారి రెండు సినిమాల బాధ్యతలు చూసుకోవడం కష్టం” అని తేల్చేసినట్టు టాక్. మరి ఈ సినిమాని నైజాంలో ఎవరు విడుదల చేస్తారో చూడాలి.