దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే కథ రెడీగా లేదు. దర్శకుడు ఎవరన్నది క్లారిటీ లేదు. ముందు ఓ దర్శకుడ్ని అనుకొని, విజయ్ కి తగిన కథని ప్రిపేర్ చేయాలి. ప్రస్తుతం దిల్ రాజు ఆ పనిలోనే బిజీగా ఉన్నాడు.
దిల్ రాజు ముందు కొన్ని సాలీడ్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి.. హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు హరీష్. అయితే అది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దాంతో మరో ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు హరీష్. దిల్ రాజుతో హరీష్ శంకర్ కున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హరీష్ దిల్ రాజు కాంపౌండ్ దర్శకుడే. సో… హరీష్ తో ఓ విజయ్ కోసం ఓ కథ రెడీ చేయడం దిల్ రాజు ముందున్న మొదటి ఆప్షన్. ఆ తరవాత.. గౌతమ్ తిన్ననూరిపై ఫోకస్ పెట్టాడు దిల్ రాజు. `జెర్సీ` తరవాత రామ్ చరణ్‌తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయాలి. కానీ.. ఆ ప్రాజెక్టు దాదాపుగా ఆగిపోయిందని టాక్. ఆ లెక్కన గౌతమ్ ఖాళీగా ఉన్నట్టే. కాబట్టి.. గౌతమ్ కు టచ్‌లో వెళ్లాడు దిల్ రాజు. ఆ తరవాత.. మరో ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడి ఉండనే ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య సినిమా కోసం బిజీ బిజీగా వర్క్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆ తరవాత… విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ప్రస్తుతానికి దిల్ రాజు ముందున్న బెటర్ ఆప్షన్లు ఇవి. వీటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.