ఏప్రిల్ 5… బాక్సాఫీసుకి కీలకమైన డేట్. ఎందుకంటే… ఈ తేదీకి ముందూ, వెనుక సెలవలే సెలవలు. వీకెండ్, పండుగలు కలిసొస్తున్నాయి. అందుకే ఏప్రిల్ 5 పై నిర్మాతలు గురి పెట్టారు. ఈ డేట్ ని ఎన్టీఆర్ `దేవర` ఏనాడో ఫిక్స్ చేసుకొంది. అయితే.. ఇప్పుడు ‘దేవర’ వెనక్కి వెళ్తుందన్న వార్తలు ఊపందుకొన్నాయి. సైఫ్ అలీఖాన్ గాయం, అనిరుథ్ ఇంకా ట్యూన్లు ఇవ్వకపోవడం తదితర కారణాలతో… ‘దేవర’ ఏప్రిల్ 5న రాకపోవొచ్చన్నది టీ టౌన్ టాక్.
‘దేవర’ ఎప్పుడైతే డౌట్ లో పడిందో, అప్పుడు దేవరకొండ అలెర్ట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. నిజానికి ‘దేవర’ విడుదలైన వారానికి ‘ఫ్యామిలీ స్టార్’ని తీసుకొద్దామనుకొన్నారు. ఇప్పుడు ‘దేవర’ డౌట్ పడేసరికి.. ఆ డేట్ ని దిల్ రాజు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 9న రావాలనుకొన్న టిల్లు స్వ్కేర్ కూడా మంచి డేట్ కోసం ఎదురు చూస్తోంది. సోలో రిలీజ్ సెంటిమెంట్ ఏం లేకపోతే… ‘టిల్లు స్వ్కేర్’ కూడా ఎన్టీఆర్ వదులుకొన్న డేట్ కే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.