విలక్షణ దర్శకుడిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ సరికొత్తగా నిర్మాతగా మారి ‘కుమారి 21ఎఫ్’ సినిమా తీశాడు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా పెట్టి సినిమా తీసిన సుక్కు కుమారికి కథ కథనాన్ని తానే అందించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుమారి పాటలు శ్రోతలను బాగా అలరిస్తున్నాయి.
అయితే సినిమా నిర్మాతగా మొదటిదే అయినా తను డైరెక్ట్ చేసిన సినిమాల మార్కెట్ తెలుసు కాబట్టి అదే ప్లాన్ తో కుమారిని సేల్ చేస్తున్నాడు సుకుమార్. రెండు రాష్ట్రాల్లో స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ కే ఈ సినిమాను ఇస్తున్నట్టు సమాచారం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నైజాంతో పాటుగా కొన్ని ఏరియాల్లో తానే రిలీజ్ చేస్తుండటం విశేషం. సినిమా నిర్మాతగా చేస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ప్రస్థానం కొనసాగించాడు. తను ప్రొడ్యూసర్ గా అయ్యింది కూడా డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన లాభాలతోనే.
ఏ సినిమా ఎంతకు కొనాలి అనేది దిల్ రాజుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు.. అంతేకాదు సినిమా ప్రివ్యూ చూసి ఆ సినిమా ఆడియెన్స్ కి రీచ్ అవ్వుద్దా కాదా అన్నది కూడా దిల్ రాజు చెప్పగలడు. ప్రస్తుతం నిర్మాతగా చేస్తూనే ఇటు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పెద్ద సినిమాలను తీసుకుంటున్నాడు. సుకుమార్ నిర్మాత కాబట్టి కుమారిని కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడట. దిల్ రాజు ఇష్టపడి కొన్నాడంటే సినిమా ఖచ్చితంగా హిట్ అన్నట్టే. మరి దిల్ రాజు చెంత చేరిన కుమారి రాజుకి ఎంత లాభాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.