దిల్‌రాజు గురించి చెప్పేదేముంది?? సినిమాల్లో ఆరి తేరిపోయారాయన. ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్టవుతుందో, ఎవరితో సినిమా చేస్తే ఎక్కువ వర్కవుట్ అవుతుందో ఆయన భలే బాగా క్యాచ్ చేసేస్తారు. ఆయన చేయి వేశారంటే… సినిమా హిట్టే. దర్శకుడు ఎవరైనా కానివ్వండి.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయనే దర్శకుడు. రన్ టైమ్ విషయంలో పక్కాగా ఉంటారాయన. ఇటీవల ఆయన్నుంచి వచ్చిన ఏ సినిమా అయినా.. రెండున్నర గంటలుంటే ఒట్టు. రెండు గంటల 10 నిమిషాలకు సినిమాని ‘కట్’ చేయడంలో ఆయన దిట్ట. ఈమధ్య దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ తక్కువ రన్ టైమ్ ఉన్నవే. ఎక్కువ సేపు ప్రేక్షకుల్ని థియేటర్లో హోల్డ్ చేయడం కష్టమని, సినిమాని వీలైనంత తొందరగా ముగిస్తే మంచిదన్నది ఆయన ఉద్దేశం.
ఆయన బ్యానర్లో రూపుదిద్దుకొన్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా దీపావళికి విడుదల అవుతోంది. సెన్సార్ కూడా అయిపోయింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు. దిల్ రాజు సినిమా ఇంత లెంగ్తీగా ఉండడం ఈమధ్య కాలంలో ఇదే ప్రధమం. రన్ టైమ్ విషయంలో దిల్‌రాజు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అనిల్ కామెడీ సీన్లు బాగా తీయలగడు. రవితేజ అందులో ఇరగ్గొట్టేస్తాడు. కామెడీ సీన్లు బాగా పండాయని, అందుకే దిల్‌రాజుకి కత్తెర పట్టుకోవాల్సిన అవసరం రాలేదని టాక్. దీపావళిని చాలా బ్యాడ్ సీజన్‌గా భావిస్తుంటారు సినీ జనాలు. ఈ సీజన్లో తన సినిమాని విడుదల చేసి చాలా పెద్ద రిస్క్ తీసుకొన్నాడు దిల్‌రాజు. ఇప్పుడు రన్ టైమ్ విషయంలోనూ అదే సాహసం చూపిస్తున్నాడు. ఈ సినిమాపై రాజుగారికి గట్టి నమ్మకాలే ఉన్నట్టున్నాయి.