‘ఫ్యామిలీ స్టార్‌’ని ప‌రుగులు పెట్టిస్తున్న దిల్ రాజు

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దింపారు. అయితే… ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతోంద‌ని, సంక్రాంతికి రావ‌డం లేద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అమెరికాలో జ‌ర‌గాల్సిన ఓ షెడ్యూల్ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. దాంతో.. సంక్రాంతికి రావ‌డం క‌ష్ట‌మే అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ముగించుకొని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి ప్రిపేర్ అవ్వాల‌ని చూస్తోంది.

ఆదివారం ఇండియా – ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్‌ టాలీవుడ్ గ‌ట్టిగా క‌నిపించింది. ‘పుష్ప‌’, ‘గుంటూరు కారం’ లాంటి భారీ సినిమాలు సైతం ఆదివారం షూటింగ్ క్యాన్సిల్ చేసేశాయి. అయితే `ఫ్యామిలీ స్టార్‌` షూటింగ్ మాత్రం ఆదివారం కూడా నిరాటంకంగా సాగింది. ఇప్ప‌టి నుంచి ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేస్తే సంక్రాంతికి రావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఒక‌వేళ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల వ‌ల్ల ఆల‌స్యం అయితే, అప్పుడు రిలీజ్ డేట్ విష‌యంలో పున‌రాలోచించాల‌ని, ప్ర‌స్తుతానికైతే సంక్రాంతి టార్గెట్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకొనే ప‌ని చేయాల‌న్న‌ది టీమ్ ఆలోచ‌న‌. దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ బ‌లంగా ఉంది. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ ఆయ‌న బ్యాన‌ర్ నుంచి ఓ సినిమా విడుద‌లై, హిట్టు కొట్ట‌డం ఆనవాయితీగా మారింది. ఆ సెంటిమెంట్ త‌ప్ప‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే దిల్ రాజు.. ఫ్యామిలీ స్టార్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close