మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్‌శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తూ విజయ పథంలో దూసుకెళ్తోంది . ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ తో పాటు ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘’సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు థాంక్స్. ఇది సినిమా విడుదలై ఐదవరోజు. ఈరోజుకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ గా సినిమా నడుస్తుంది. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన సాయిధరమ్ తేజ్ కి ఒక సూపర్ స్టార్ రేంజ్ కి కలెక్షన్స్ రావడం ఆనందంగా ఉంది. తేజ్ రాకింగ్. హరీష్ శంకర్ పట్టుదలతో ఈ సక్సెస్ ఫుల్ సినిమాని నిర్మించాడు. రాంప్రసాద్ గారు తన సినిమాటోగ్రఫీతో ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ వర్క్ ఇచ్చారు. అమెరికాలో తీసిన సన్నివేశాలు, గువ్వా గోరింక.. సాంగ్ పిక్చరైజేషన్ కి మాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. గౌతంరాజుగారు తన ఎడిటింగ్ వర్క్ తో సినిమాని లాగింగ్ లేకుండా కట్ చేశారు. మిక్కి జె.మేయర్ ఫస్ట్ టైమ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. రెజీనా, నాగబాబు సహా ప్రతి ఆర్టిస్ట్ కి, టెక్నిషియన్ కి థాంక్స్’’ అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’ ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ సినిమాలో నేను నటించడానికి నా ఫ్రెండ్స్ కారణం. వాళ్ళు ఈ కథను వినమని చెప్పారు. వినగానే నచ్చి చేశాను. ఒకవేళ నేను చేయకపోయుంటే చాలా మిస్ అయ్యుండేవాడిని. ఈ సినిమా కోసం నన్ను సెలక్ట్ చేసినందుకు హరీష్ శంకర్ కి థాంక్స్. రచయితలు నన్ను నమ్మి మంచి సీన్స్ రాసినందుకు థాంక్స్. రాంప్రసాద్ గారు నన్ను హ్యండ్ సమ్ గా చూపించారు. మావయ్య ఎర్లీ స్టేజ్ లో క్రాంతికుమార్ అనే ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్ గా నిలిచారు. అలాగే నాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సపోర్ట్ గా నిలిచింది. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణలకు థాంక్స్. అలాగే హర్షిత్ నాకు అండగా నిలబడుతున్నాడు. అందుకు తనకి కూడా థాంక్స్. రావు రమేష్ గారు డేడికేషన్ ఉన్న యాక్టర్. ఆయనతో నటించినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. మిక్కిగారు ఈ సినిమాకి ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. రెజీనాతో మూడేళ్ళుగా పరిచయం ఉంది. మంచి తపన ఉన్న హీరోయిన్. తన నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. మంచి కోస్టార్. ఇతర నటీనటులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమాని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’అన్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘’ సక్సెస్ పెయిల్యూర్స్ పై రిలేషన్స్ ఆధారపడి ఉండే ఇండస్ట్రీలో దిల్ రాజుగారు లాంటి వ్యక్తులు అరుదు. జయాపజయాలతో సంబంధం లేకుండా మనిషి టాలెంట్ ను నమ్మే వ్యక్తి. ఆయన నమ్మకం, ఇచ్చిన సపోర్టే సుబ్రమణ్యం ఫర్ సేల్ సక్సెస్ కు కారణం. హర్షిత్ కు ఈ సినిమా సెకండ్ ప్రొడక్షన్. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అమెరికా లో షూట్ అంత బాగా రావడానికి కారణం తనే. చాలా దగ్గరుండి చూసుకున్నాడు. వెన్నుదున్నుగా నిలిచాడు. మిక్కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తేజు సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను డాన్సులు, డైలాగులు ప్రతిదాంట్లో కేర్ తీసుకొని చేసాడు. నెక్స్ట్ స్టార్ హీరో. తనతో నేను చేయడానికి కారణం ఒక స్వార్థం. రిపీట్ ఆడియెన్స్ వస్తున్నారు. నేను ఊహించిన దానికంటే పెద్ద హిట్. ఈ సినిమా సూపర్ హిట్ స్థాయి నుండి బ్లాక్ బస్టర్ స్థాయికి వెళుతున్నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ మన సినిమాలాగా భావించి పనిచేశారు’’ అని చెప్పారు.
హర్షిత్ మాట్లాడుతూ ‘’రేయ్ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఆ ఫోటోస్ ను నేను హరీష్ శంకర్ గారికి చూపించాను. ఆయన చూడగానే కుర్రాడు గునపంలా ఉన్నాడురా అన్నారు..ఇతనితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. టైటిల్ మళ్ళీ చెబుతాను అన్నారు. ఆయన అన్నట్టుగానే తేజ్ కి కథ చెప్పడం, సినిమా స్టార్ట్ కావడం, ఆ సినిమాకి నేను పనిచేయడం జరిగాయి. చాలా హ్యపీగా ఉంది. హరీష్ గారి ఐడియాస్ ను రాంప్రసాద్ గారు చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్. సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
రావు రమేష్ మాట్లాడుతూ ‘’నేను బయటకు వెళ్ళినప్పుడల్లా సినిమా గురించి మంచి రెస్పాన్స్ వస్తుంది. సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాడని అందరూ అంటున్నారు. హరీష్ శంకర్ అంటే స్వార్థం. ఆయన నాలోని మరో యాంగిల్ ను పరిచయం చేస్తుంటాడు. ఆయనంటే నాకు అంత పిచ్చి. అందుకే ఆయన్ను ఇమిటేట్ చేస్తుంటాను. నాకు చాలా మంచి పేరు వచ్చింది. హరీష్ గారు అనుకుంటే ఒక నటుడుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. నా క్లాస్ మేట్స్ తో కలసి చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. హరీష్ శంకర్ గారు నన్ను కొత్తగా చూపించారు. మంచి హిట్ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్ మాట్లాడుతూ ‘’సాయిధరమ్ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం.తనని ప్రేమిస్తూ చేసిన సినిమా ఇది. హరీష్ శంకర్ తో ఫ్యూచర్ లో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శిరీష్, భాస్కర్ భట్ల, చంద్రబోస్, సతీష్ వేగ్నేశ, సుమన్, రణధీర్, శాస్త్రి, తోటప్రసాద్, ప్రభాస్ శ్రీను, చిట్టి, తదితరులు పాల్గొని సినిమ సూపర్ హిట్ అయినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.