దిల్‌రాజు ఓ దర్శకుడ్ని నమ్మాడంటే ఓ పట్టాన వదలడు. ఫ్లాపులున్నా సరే – విడవడు. చాలామంది విషయంలో ఇదే రుజువైంది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అండ దండ కూడా ఆయనే. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు సినిమాలు రెండూ వీళ్ల కాంబోలోనే వచ్చాయి. బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అవ్వడం, అంతకు ముందొచ్చిన ముకుంద కూడా ఏమాత్రం రక్తి కట్టించకపోవడంతో శ్రీకాంత్ అడ్డాల వైపు చూడ్డానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దిల్‌రాజు ఆయనకు ఆపన్న హస్తం అందించారు. దిల్‌రాజు కాంపౌండ్ లో మూడో సినిమా చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దాదాపుగా సిద్ధమైపోయారు. ఇప్పటికే కథ కూడా రెడీగా ఉందట. కొత్త బంగారు లోకం టైపులోనే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ తీయడానికి శ్రీకాంత్ రెడీగా ఉన్నాడని టాక్. దిల్‌రాజుకీ ఈ కథ నచ్చిందట. అయితే కొత్తవాళ్లతో వెళ్దామా? లేదంటే యంగ్ హీరోల్లో ఒకరిని ఎంచుకొందామా అనేది ఇంకా తేల్లేదు. కాకపోతు ఈ సినిమాతో హిట్టు కొట్టడం శ్రీకాంత్‌కి అత్యవసరం. ఆ హిట్టు ఇచ్చే బాధ్యత దిల్‌రాజు తీసుకొన్నారిప్పుడు. మరి ఈ హ్యాట్రిక్ కాంబోకి ముహూర్తం ఎప్పుడో మరి.