శుక్రవారం విడుదలైన ‘ఛలో’.. మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మరోవైపు ‘టచ్ చేసి చూడు’ కి నెగిటీవ్ టాక్ రావడంతో… ఈ వీకెండ్ ‘ఛలో’దే రాజ్యం. ఈ సినిమాతో నాగశౌర్య ఖాతాలో మరో హిట్టు పడిపోయినట్టే. ఈ విజయం వెనుక నిర్మాత దిల్‌రాజు అదృశ్యహస్తం కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్రబృందమే చెప్పింది. ఛలో సినిమాని డిసెంబరు 29న విడుదల చేద్దామనుకున్నార్ట. ఈ విషయం దిల్‌రాజుకి తెలిసి.. ”డిసెంబరు కరెక్ట్ డేట్ కాదు. సంక్రాంతి అయిపోయిన తరవాత.. రండి. ఫిబ్రవరి 2 డేట్ ఖాళీగా ఉంది. అప్పుడైతే… లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది” అని సలహా ఇచ్చారు. పంపిణీ, నిర్మాణ రంగంలో అపారమైన అనుభవం ఉన్న దిల్‌రాజు చెప్పిన మాట పొల్లుపోదన్న నమ్మకంతో డిసెంబరులో రావాల్సిన సినిమాని వాయిదా వేసుకొని, అప్పటి కప్పుడు ఫిబ్రవరి 2 రిలీజ్ డేట్‌గా ప్రకటించారు. నిజంగానే ఫిబ్రవరి 2న ఛలో రావడం మంచిదైంది. సంక్రాంతి హడావుడి అయిపోయింది.. పెద్ద సినిమాల తాకిడి కూడా లేదు. దాంతో…’ఛలో’కి మంచి రిలీజ్ దొరికినట్టైంది.