బోయపాటి శ్రీనుని దర్శకుడుగా పరిచయం చేస్తూ రవితేజ హీరోగా ‘భద్ర’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు ఆ తర్వాత రవితేజతో మళ్ళీ సినిమా చెయ్యలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రవితేజతో సినిమా తియ్యాలని ప్లాన్ చేసిన దిల్‌రాజు రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో అతనితో చెయ్యాలనుకున్న ప్రాజెక్ట్‌ని అర్థాంతరంగా ఆపేశాడు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ని కింగ్ నాగార్జునతో చెయ్యబోతున్నాడన్నది లేటెస్ట్ న్యూస్. రవితేజకు ఈ కథ నచ్చకపోవడం వల్లే అతనితో ఈ సినిమా చెయ్యడంలేదని దిల్‌రాజు చెప్తున్నా రెమ్యునరేషనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ని నాగార్జునతో చెయ్యాలన్న ఉద్దేశంతోనే రెమ్యునరేషన్ సాకుతో దిల్‌రాజే.. రవితేజను తప్పించాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
నాగార్జునకు ఇమేజ్‌కి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ కథ వినిపించారనీ, కథ విన్న నాగార్జున కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నాగార్జున తన నెక్స్ట్ మూవీ కె.రాఘవేంద్రరావుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘హాథీరాం బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా తర్వాత నాగార్జున, దిల్‌రాజుల సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం వుంది