గత ఏడాది మొత్తం మీద దిల్ రాజు బ్యాలెన్స్ షీట్ లో నష్టాలు 40 కోట్లు అని ఇండస్ట్రీ టాక్. అటు ప్రొడక్షన్ అయితేనేం, ఇటు డిస్ట్రిబ్యూషన్ అయితేనేం తేలిన లెక్క అదీ అని టాక్. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే రోబో 2.0 ఓ అయిదు, వినయ విధేయ ఓ అయిదు పట్టుకెళ్లిపోయాయని కూడా వార్తలు వున్నాయి.
అంటే టోటల్ టర్నోవర్ లాస్ గా యాభై లెక్క వేసుకోవాల్సిందే. అయితే అదృష్టం ఎక్కడ వచ్చిందీ అంటే F2 రూపంలో. ఇప్పుడు ఈ సినిమా టోటల్ లాంగ్ రన్ లో కనీసం ముఫై కోట్లు మిగులుస్తుందని అంచనా. అంటే పాత నష్టాలు సగానికి పైగా పూడ్చేస్తుందన్నమాట.
నష్టాలు సగం వరకు పూడ్చడం సంగతి అలా వుంచితే ఇదే సినిమా ద్వారా ఆయన స్వంత థియేటర్ల ఆదాయం కూడా బాగానే సమకూరుతుంది. పైగా బిజినెస్ టర్నోవర్ కు భయంకరంగా ఉపయోగపడుతుంది. అందుకే దిల్ రాజు చకచకా ఈ ఏడాది మరో అయిదు సినిమాలు అందించాలని డిసైడ్ అయిపోయారు. మహర్షి, 96 రీమేక్ తో పాటు మరో మూడు సినిమాలు అన్నమాట. పైగా ఆస్థానంలో ఇంద్రగంటి, వేణు శ్రీరామ్ లాంటి వాళ్లు రెడీగానే వున్నారు.