లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. లాక్ డౌన్ సమయంలో తేజస్వినితో దిల్ రాజుకి వివాహమైన సంగతి తెలిసిందే. సాధారణంగా.. భార్యలు, తమ భర్తల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం చూస్తుంటాం. కానీ… తేజస్వినిలో మరో టాలెంట్ వుందట. తను కథలు రాస్తుందని తెలుస్తోంది. వాటిలో సక్సెస్ ఫుల్ సినిమాలకు కావల్సినంత సరుకు ఉందని.. దిల్ రాజు గ్రహించాడట. తేజస్విని ఇప్పటికే కొన్ని కథల్ని స్క్రిప్టు రూపంలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కథల ఎంపికలో దిల్ రాజుది అంది వేసిన చేయి. కాబట్టి… తేజస్వినిలోని టాలెంట్ పసిగట్టడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆమె రాసిన కథతో.. దిల్ రాజు త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అంతే కాదు.. దిల్ రాజు చేయబోయే సినిమాల కథల విషయంలోనూ.. తేజస్విని సలహాలు తీసుకుంటున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్.