ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయారిటీ మార్చేశారు. నిన్నటిదాకా కరోనా దెబ్బకు.. దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పడుతుందో.. అన్న చర్చ జరిగింది. అసలు ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే.. హఠాత్తుగా నరేంద్రమోడీ.. బిగ్ బాస్ మాదిరిగా తెరపైకి వచ్చేశారు. బిగ్ బాస్ ఇళ్లల్లో ఇరుక్కుపోయినట్లుగా ఇరుక్కుపోయిన దేశ ప్రజలందరికీ ఓ టాస్క్ ఇచ్చారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు.. లైట్లు ఆర్పేసి క్యాండిల్స్ వెలిగించడం ఆ టాస్క్. రిలీఫ్ ఏమైనా ఇస్తారేమోనని.. ఆశ పడిన చాలా మందికి నిరాశ ఎదురయింది కానీ.. అది అసలు లెక్కలోకి లేకుండా పోయింది. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా.. లైట్లు ఆర్పేయాలా.. వద్దా… కొవ్వొత్తులు వెలిగించాలా వద్దా అన్నదానిపైనే.
ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండి.. చుట్టుముట్టబోయే ఆర్థిక సమస్యల గురించి మధనపడుతున్న మధ్యతరగతి జీవులకు.,. మోడీ ప్రకటన మంట పుట్టించింది. దాంతో వారు ఆయనపై ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఇదే సందుగా… మోడీ అనుకూల వర్గం.. మోడీ వ్యతిరేక వర్గం చెలరేగిపోయింది. మధ్యలో మధ్యతరగతి వర్గం ఆగ్రహాన్ని పక్కన పెట్టేసి.. అసలు మోడీ ఆ పిలుపు ఇవ్వడానికి కారణం ఏమిటననేదానిపై చర్చ ప్రారంభించారు. మోడీ అనుకూలురు… జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, భూగోళ శాస్త్రం.. ఇలా ఎన్ని శాస్త్రాలుంటే అన్ని శాస్త్రాలను విడివిడిగా..మిక్స్ చేసి మరీ.. ఆ తొమ్మిది గంటలు.. తొమ్మిది నిమిషాలకు లైట్లు ఆర్పేసి.. కొవ్వొత్తులు వెలిగించడం వలన కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. మోడీ వ్యతిరేకులు.. అంతే శాస్త్రీయంగా.. పిచ్చిపనులు చేయిస్తున్నారని… ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అదే సమయంలో.. ఒకే సారి దేశ ప్రజలంతా.. లైట్లు ఆర్పేస్తే.. కరెంట్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయి.. గ్రిడ్ కుప్పకూలిపోతుందనే ఆందోళనలు.. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్లలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో కరెంట్ వినియోగం తగ్గిపోయింది. ఇప్పుడు.. . లైట్లు.. కూడా అందరూ ఒకే సారి ఆపేస్తే.. గ్రిడ్ కుప్పకూలిపోతుందని.. అదే జరిగితే.. దేశం చీకట్లోకి వెళ్లిపోతుందని..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా.. వెంటనే చర్యలు తీసుకోవాలని.. వివిధ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు… తమ తమ సిబ్బందిని ఆదేశిస్తున్నారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన టాస్క్ తో… టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది.
Now more work to Powermen.
Due to PM Modi’s call for switching off of lights for 9 mins on April 5, load is expected to have a steep fall at 9 PM & a steep rise around 9.09 PM…
To keep Power Grid safe, load shedding in staggered manner from 8-9 PM is advised…men on standby. pic.twitter.com/x2bMugY85P— Arvind Gunasekar (@arvindgunasekar) April 3, 2020