తమిళనాడు లో రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద కుదుపు కు గురికానున్నాయి. దివంగత సీఎం జయలలిత నియోజకవర్గo ఆర్కే నగర్లో దినకరన్ దాదాపు గెలుపు ముంగిట నిలిచారు. ఉద్రిక్తత, గందరగోళం మధ్య ఆదివారం జరిగిన కౌంటింగ్ సరళి చూస్తుంటే ఆయన గెలుపు లాంఛనమే. దాదాపు15 వేల పైచిలుకు ఓట్లతో ప్రత్యర్ధులకు అందనంత దూరంలో ఆయన దూసుకుపోతున్నారు.
ఇప్పటికే గెలుపు ఖాయమని తేలడంతో చిన్నమ్మ వర్గం సంబరాల్లో మునిగింది. రెండాకుల గుర్తు కూడా కోల్పోయి మరీ టి టి వి దినకరన్ సాధించిన విజయం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసేదే.
ఈ గెలుపు తమిళ రాజకీయాల పై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం ప్రభుత్వ మనుగడకు ప్రమాదం గా పరిణమించే అవకాశం లేకపోలేదు అంటున్నారు.