ఆయన టాలీవుడ్లో అగ్ర దర్శకుడు. ఇటీవల ఓ భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కాకపోతే `ఎఫైర్ల` విషయంలో ఆయనకు చాలా `పేద్ధ` పేరుంది. తన సినిమాలో నటించిన హీరోయిన్లందరితోనూ ఈయన రొమాన్స్ నడుపుతారని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తుంటాయి. కొంతమంది కథానాయికల్ని వదిలించుకోవాల్సివచ్చినప్పుడు వాళ్లకు ఎంతో కొంత `నజరానా` ఇచ్చి… ఆ `డీల్`కి క్లోజ్ చేస్తారట. ఇలా ఓ కథానాయికకు మూడు కోట్లకు పైగానే అందాయని అప్పట్లో చెప్పుకున్నారు. తాజాగా… ఆయన మరో ప్రేమకథ స్టార్ట్ చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్నగర్లో గుసగుసలు ఎక్కువయ్యాయి. ఓ కథానాయికతో ఈ దర్శకుడు బాగా సన్నిహితంగా మెలుగుతున్నారని హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ కథానాయికకు ఓ అపార్ట్మెంట్ కూడా కొనిచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సదరు దర్శకుడి ఇంట్లో కూడా తెలిసిపోయిందని, ఈ విషయమై.. గొడవలు కూడా మొదలయ్యాయని సమాచారం. ఇప్పటికే అమ్మాయిల వీక్నెస్పై ఈయన గురించి టాలీవుడ్లో చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్లందరికీ మరో అస్త్రం దొరికినట్టైంది.