వంద కొట్టాక నందమూరి బాలకృష్ణ మరింత స్పీడు పెంచేశాడు. చక చక సినిమాలు చేసేస్తున్నాడు. 2019 నే తీసుకోండి. జనవరిలో ఓ సినిమా (కథానాయకుడు), ఫిబ్రవరిలో మరో సినిమా (మహా నాయకుడు) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ వెంటనే బోయపాటి శ్రీను సినిమా మొదలైపోతుంది. ఈ యేడాదిలోనే దాన్నీ విడుదల చేయాలన్నది బాలయ్య ప్లాన్. కాకపోతే… బోయపాటి కాస్త స్లో. మేకింగ్ స్పీడు స్పీడుగానే ఉన్నా… సినిమాని పట్టాలెక్కించడానికి కాస్త సమయం తీసుకుంటారు. అయితే.. బోయపాటి సినిమా ఈ యేడాది వచ్చినా, రాకున్నా – 2019లోనే మరో సినిమాకీ శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాడు బాలయ్య. ఆ అవకాశం అనిల్ రావిపూడి కి దక్కడం దాదాపు ఖాయమైపోయింది. `పటాస్` తరవాత అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అది అప్పట్లో సాధ్యం కాలేదు. ఈలోగా మరో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. అప్పట్లో అనిల్ రావిపూడి చెప్పిన కథ బాలయ్యకు తెగ నచ్చిందని, అందుకే ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ కథకు సంబంధించిన డిస్కర్షన్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమానీ ఎన్బికే బ్యానర్లోనే చేయాలని బాలయ్య భావిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం `ఎఫ్ 2` ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా అయ్యాక.. కొంత గ్యాప్ తీసుకుంటాడు. ఎలాగూ బోయపాటి సినిమా ఒకటి ఉంది కాబట్టి అనిల్ రావిపూడి ఈ మధ్యలో మరో సినిమా పూర్తి చేసి రావొచ్చు.