పవర్ తో మెగాఫోన్ పట్టి, దర్శకుడిగా నిరూపించుకున్నాడు బాబి. ఆ తరవాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తిగా నిరాశ పరిచింది. పవన్ కల్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా, దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. అయితే ఆ తరవాత జై లవకుశతో మళ్లీ ట్రాక్‌లోకి రాగలిగాడు. వెంకీ మామ ఓకే అనిపించుకోవడంతో ఇప్పుడు బాబిపై నిర్మాతలు, హీరోల దృష్టి మళ్లీ పడింది.
ఏ దర్శకుడు హిట్టు కొట్టినా, అడ్వాన్సు చేతిలో పెట్టేయడం మైత్రీ మూవీస్‌కి అలవాటు. ప్రస్తుతం బాబికి అడ్వాన్సు ఇచ్చారు. బాబి తదుపరి సినిమా మైత్రీలోనే చేయాలి. హీరో ఎవరన్నది ఇంకా ఖాయం కాలేదు. మైత్రీ మూవీస్‌కి ఇది వరకే ఓ లైన్ చెప్పాడు బాబి. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆ హీరోలు ప్రస్తుతం ఖాళీగా లేరు. అందుకే మంచి ఆప్షన్ కోసం వెదుకుతున్నాడు బాబి. మరో వారం పది రోజుల్లో బాబి హీరో ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ రానుంది.