సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ ఎంటర్ ఎంటర్టైనర్లను అందించి దర్శకుడు కె దశరధ్. అయితే 2016లో మంచు విష్ణుతో చేసిన శౌర్య సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథ రాసుకొని ఆయనే నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం. డివై చౌదరి, కె దశరధ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ హీరో హీరోయిన్లు.
దశరధ్ మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు, రచయిత. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఆయన టాప్ లీగ్ లో చేరారు. మళ్ళీ నాగార్జున తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐతే వీరి కాంబినేషన్ లో వచ్చిన గ్రీకు వీరుడు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఎందుకో దశరధ్ వేగం తగ్గింది. శౌర్య సినిమా కూడా విఫలమైయింది. ఐతే గ్యాప్ లోసినిమా స్కీన్ ప్లే పై ఒక పుస్తకం రాశారాయన. త్వరలోనే దిన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లోగ నిర్మాతగా కూడా మారారు దశరధ్.