దర్శక దిగ్గజం, దర్శక రత్న దాసరి నారాయణ రావు(75) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అన్నవాహిక, మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో సమస్యలతో అస్వస్థతకు గురైన దాసరిని ఈ యేడాది జనవరిలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఏ దశలోనూ కోలుకోలేదు. ఇటీవల ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఊపిరితిత్తులకు మళ్లీ ఇన్‌ఫెక్ష్‌న్ సోకడంతో నాలుగురోజుల క్రితం మరోసారి కిమ్స్‌లో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1924 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్ దంపతులకు జన్మించిన దాసరి.. 151వ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రచయితగా, నటుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన దాసరి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు.