దిల్‌రాజు తమ్ముడు తనయుడు హర్షిత్ … టాలీవుడ్ కి పరిచయమే. దిల్ రాజు బ్యానర్లో వచ్చే సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలు తను చూసుకుంటాడు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన `లవర్` చిత్రానికి తనే నిర్మాత. ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఆథోనీ ఎం.ఎల్.ఏ వై. సాయి ప్రసాద్ రెడ్డి తనయ గౌతమితో ఇటీవల హర్షిత్ నిశ్చితార్థం జరిగింది. ఈనెల 21 తెల్లవారుఝామున 3 గంటలకు గోవాలో పెళ్లి. ఈ పెళ్లికి టాలీవుడ్‌కి చెందిన కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలకు మాత్రమే ఆహ్వానం అందింది. 23న హైదరాబాద్‌లోని ఓం కన్వెన్షన్ సెంటర్లో వివాహ విందు ఇవ్వబోతోంది దిల్‌రాజు కుటుంబం. ఈ కార్యక్రమానికి మాత్రం… టాలీవుడ్ మొత్తం హాజరు కానుంది.