‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలతో ఆకట్టుకునాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. అయితే బంగార్రాజు మాత్రం నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడాయన మెగాస్టార్ చిరంజీవికి కోసం ఓ కథని రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. కథ చెప్పాలని కోరడం, చిరంజీవి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది.
చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీస్ మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కళ్యాణ్ కృష్ణ అన్నయ్య కురసాల కన్నబాబు పార్టీలో చేరారు. ఇప్పుడాయన ఏపీ మంత్రిగా వున్నారు. ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం ‘భోళా శంకర్’ షూటింగ్ లో వున్నారు చిరంజీవి. ఆయన వీలు చూసుకొని కథ చెప్పబోతున్నారు కళ్యాణ్ కృష్ణ. చిరంజీవికి కథ నచ్చితే గనుక ఆయన లైన్ లో మరో ప్రాజెక్ట్ చేరినట్లే.