ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు క్రాంతి మాధవ్. ఇందులో శర్వాతో చేసిన మళ్ళీ మళ్ళీ చాలా మంచి సినిమా. కమర్షియల్ గా ఆడలేదు కానీ డైరెక్టర్ గా తనపై గౌరవం పెంచింది. అయితే ఈ సినిమా తర్వాత అనూహ్యంగా సునీల్ తో ఉంగరాల రాంబాబు అనే సినిమా తీశారు. ఆ సినిమా పెద్ద దెబ్బకొట్టింది. మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది.
చాలా నిరీక్షణ తర్వాత విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి నాలుగేళ్ళు పట్టింది. ఎట్టకేలకు కె క్రాంతి మాధవ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. గంటా కార్తీక్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని డీజీఎల్ అనే టైటిల్ పెట్టారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ కథని రాసుకున్నారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలోనే హీరోతో పాటు మిగతా వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. దర్శకుడిగా ఈ సినిమా క్రాంతి మాధవ్ కి చాలా కీలకం. మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలంటే సక్సెస్ కొట్టాల్సిందే.