63వ జాతీయ పురస్కారాలు తెలుగు పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి.. ఓ పక్క ఉత్తమ జాతీయ చిత్రంగా బాహుబలి అవార్డ్ కైవసం చేసుకోగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె సినిమాకు పురస్కారం దక్కడం విశేషం. అయితే కంచె సినిమా తీసేప్పుడు కాని అది రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందినప్పుడు కాని ఈ అవార్డ్ గురించి అసలు ఆలోచించలేదని అన్నారు కంచె సినిమా దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్.
సినిమాలో విషయం ఉంది కాబట్టే అవార్డ్ దక్కించుకుంది. కంచె సినిమా కోసం క్రిష్ పడ్డ కష్ట తెర మీద కనిపించింది. సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వకపోయినా ప్రేక్షకుల మనసుని గెలుచుకున్న సినిమాగా ఇది క్రేజ్ సంపాధించింది. తాను తీసిన కంచె సినిమాకు ఈ అవార్డ్ వచ్చినందుకు ఆనందంగా ఉందని.. ఈ సినిమాకు ఆ అర్హత ఉందని అన్నారు క్రిష్. ఇక రెండు తెలుగు సినిమాలు జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు చిత్రాల టీం మొత్తానికి ట్వీట్ చేసి విష్ చేయడం విశేషం.