వినాయక్‌తో సినిమా మొదలుకాబోతున్నా సరే.. బాలకృష్ణ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పైనే ఉంది. ‘ఈ సినిమా ఆగిపోయింది’ అనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నా- ఇవేం పట్టించుకోకుండా బాలయ్య తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. తేజ పక్కకి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతల్ని కూడా తానే మోయాల్సివస్తోంది. అయితే సన్నిహితుల సలహా మేరకు.. దర్శకత్వం విషయంలో బాలయ్య పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇది వరకు బాలయ్య క్రిష్‌ని కలిసి ఎన్టీఆర్ బయోపిక్‌ని హ్యాండిల్ చేయమని అడిగాడు. అయితే అప్పుడు `మణికర్ణిక` బిజీలో ఉన్న క్రిష్.. బాలయ్య ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. అయితే… ఇప్పుడు మరోసారి క్రిష్‌తో బాలయ్య బేటీ కానున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న క్రిష్ శుక్రవారం హైదరాబాద్ వస్తారు. వచ్చిన వెంటనే బాలయ్యతో ఓ భేటీ జరగనుంది. ఈసారి బాలయ్య క్రిష్‌ని ఒప్పించి తీరతారన్నది ఆయన సన్నిహితుల మాట. క్రిష్ కూడా ఈసారి బాలయ్యకు ఓకే చెప్పే అవకాశాలున్నాయని తేలింది. బాలయ్య తనపై నమ్మకంతో తన వందో చిత్రాన్ని క్రిష్ చేతుల్లో పెట్టాడు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సమయంలో క్రిష్ ఎంత పారితోషికం ఇస్తే.. అంతా తీసుకున్నాడు. ఆ గౌరవంతో క్రిష్ ఈసారి బాలయ్య మాటకు తలొగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతుల్లో వెళ్లడం ఖాయమని, అతి త్వరలో ఓ అదికారిక ప్రకటన కూడా రావొచ్చని నందమూరి కాంపౌండ్ వర్గాల మాట.