క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారంటూ ప్రచారం మొదలైంది. ఓ ఓటీటీ సంస్థకు ఈ సినిమాని అమ్మేశారని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ఈసినిమా ఇంకా పూర్తి కానేలేదు. షూటింగ్ పార్ట్ మాత్రమే అయ్యింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పాత్ర చాలా కీలకం. అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ జంతువుల్నీ, ఆ వాతావరణాన్ని సృష్టించడానికి వీఎఫ్ఎక్స్ చాలా కీలకం. 80 శాతం పని వీఎఫ్ఎక్స్ కంపెనీలదే. దేశ, విదేశీ కంపెనీలకు ఆ పనుల్ని అప్పగించాడు క్రిష్. వాళ్లేమో.. ఫస్ట్ కాపీ డిసెంబరు వరకూ ఇవ్వలేమని చెప్పేశార్ట. అంటే.. ఈ సినిమా ఈ యేడాది రాకపోవొచ్చు.
పైగా.. వీఎఫ్ఎక్స్ తో పెట్టుకుంటే ఆ పనులు ఎప్పటికి అవుతాయో చెప్పలేం. కాబట్టి.. రిలీజ్ డేట్ విషయంలో క్రిష్ ఏమాత్రం టెన్షన్ పడడం లేదని సమాచారం. పైగా.. ఇదో థియేటరికల్ ఎక్స్పీరియన్స్ సినిమా. జంగిల్ బుక్లాంటి విజువల్స్ ఉన్నప్పుడు.. వాటిని బుల్లి తెరపై అంతగా ఆస్వాదించలేం. పెద్ద తెరే కావాలి. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసినిమాని ఓటీటీలోకి విడుదల చేసే అవకాశం లేదు. అన్నింటికంటే పెద్ద విషయం.. `ఉప్పెన` తరవాత వైష్ణవ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఆ సినిమా 50 కోట్లు దాటింది. ఆమేరకు రెండో సినిమాకి బిజినెస్ జరుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికైనా థియేటర్లోనే ఈ సినిమాని విడుదల చేస్తారు.