జగన్ రెడ్డిని నమ్ముకుని జైలుకెళ్లేవారి జాబితాలో సినిమా వాళ్లూ ఉన్నారని తాజాగా బయటకు వస్తున్న స్కాములు, అందులో డబ్బులు నొక్కేసిన వారి పేర్లు నిరూపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు నిర్మాతలుగా తమ పేర్లు వేసుకుని ప్రాపగాండా సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, మహి వి రాఘవ్ లు చేసింది దోపిడీనే అని తాజాగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాధనాన్ని వీరు తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఆ డబ్బులతోనే సినిమాలు తీశారు. డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ పేరుతో డబ్బులు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారు.
వ్యూహం, యాత్ర 2 సినిమాల డబ్బులు ప్రజలవే !
వ్యూహం సినిమాలు తీసినందుకు ఆర్జీవీ కి చెందిన కంపెనీల పేరుతో డబ్బులు కొట్టేశారు. నేరుగా ప్రజాధనం ఆయన ఖాతాల్లోకి చేరింది. ఇక ప్రొడ్యూసర్ గా తన పేరు వేసుకుని యాత్ర 2 సినిమాలు చేసి హార్సిలీ హిల్స్ లో స్థలాన్ని కూడా కొట్టేయబోయి బయటపడిన తర్వాత నీతులు కూడా చెప్పిన మహి వి రాఘవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది.
ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లే సమయం వచ్చించి మహి వి రాఘవ్ !
మహి వి రాఘవ్ అలియాస్ మహేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పత్రాలు రెడీ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజాధనం కొట్టేసి ఆ పేరుతో ప్రాపగాండా సినిమాలు తీసి మళ్లీ దానికి నీతులు చెప్పడానికి.. ఎకరాలకు ఎకరాలు స్టూడియోల పేరుతో కొట్టేయడానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసిన ప్రయత్నాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అంతేనా బయట పెట్టిన వారిపై విరుచుకుపడి.. చాలెంజ్‌లు కూడా చేశారు. ఇప్పుడు అసలు కథ అంతా బయటకు వస్తుంది. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి రాస్తోంది. తలదాచేసి పోలీసులు మీడియా ముందు నిలబెట్టే సీన్ ఉన్నా ఆశ్చర్యం లేదు.
అడ్డగోలు దోపిడీ – సిగ్గు లేకుండా వితండవాదం
ప్రభుత్వానికి వీడియోలు చేశామని అందుకే కోట్లకు కోట్లు ఇచ్చారని ఎన్ని కథలు చెప్పినా .. అసలు కథ ఏంటో డిజిటల్ కార్పొరేటర్ లెక్కలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అన్నీ ఒకే సారి కాదు .. ఒక్కొక్కటిగా బయటకు తెచ్చి జాతకాల్ని రోడ్డు మీద పెట్టబోతున్నారు. గతంలో చెప్పిన నీతులన్నీ గుర్తు చేసుకుని మరోసారి తాము ప్రజాధనం దోచుకోలేదని.. వ్యూహం, యాత్ర సినిమా తీసి జగన్ రెడ్డి ఓడిపోవడానికి తన వంతు సాయం చేసినందుకు సన్మానమో.. శాలువాలో కప్పాలి కానీ కేసులు పెడతారా అని వాదించడానికి వీరు రెడీ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.