అక్కినేనిని `నట సామ్రాట్` అనే వాళ్లు. ఆయన వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జునకి `యువ సామ్రాట్` అనే ట్యాగ్ లైన్ వచ్చింది. టైటిళ్లలో `యువ సామ్రాట్ నాగార్జున` అనే పడేది. నాగ్ వయసు పెరిగే కొద్దీ `యువ సామ్రాట్` అని తగిలించుకోవడానికి కాస్త ఇబ్బంది పడేవారు. `కింగ్` వచ్చాక, అది హిట్టయ్యాక.. అప్పటి నుంచి `కింగ్` నాగార్జున అయిపోయారు. `యువ సామ్రాట్` అనే బిరుదు అలా ఖాళీగా ఉండిపోయింది. చైతూని అభిమానులు `నవ సామ్రాట్` అని పిలుచుకోవడం ఆనవాయితీ. అయితే కొంతకాలంగా `నవ సామ్రాట్` అనే టైటిల్ సరిగా వాడడం లేదు. అయితే ఇప్పుడు `యువ సామ్రాట్` మళ్లీ బయటకు వచ్చింది. `శైలజా రెడ్డి అల్లుడు` టైటిల్ కార్డులో చైతూ పేరు పక్కన యువ సామ్రాట్ వచ్చేయబోతోంది. ఈ విషయాన్ని మారుతి ధృవీకరించారు. `ఈ సినిమాతో చైతూ యువ సామ్రాట్ అయిపోయారు. టైటిల్ కార్డులో ఆ ట్యాగ్ లైన్ వేస్తున్నాం` అని మారుతి ప్రకటించారు. అఖిల్‌కే ప్రస్తుతానికి ఎలాంటి స్టార్ ట్యాగూ లేదు. ఈ నవ సామ్రాట్… అఖిల్‌కి షిఫ్ట్ అయిపోతుందేమో చూడాలి.